I కోరింథీ-53 14:10-22 May 29, 2023
భాషలకు ఉండవలసిన సరైన స్థానం-1
సజీవ నిరీక్షణ శ్రోతలందరికి యేసురక్షకుని శుభకరమైన నామములో శుభములు, వందనములు! నిరాశకు,
నిస్పృహకు, బాధలకు, వేదనలకు నాకు తెలిసిన ఔషధం పరిశుద్ధగ్రంధం బైబిల్, దేవుని మాటను నమ్మడం.
నమ్మేదెలాగని ఆలోచిస్తున్నారా? చదవడం ఆరంభించండి, మీకే అర్థమవుతుంది. నేను చేస్తున్నదికూడా అదే! మీరే
స్థితిలో ఉండి, మీ పరిశుద్ధ గ్రంధం బైబిల్ ఔషధమని నమ్మి చదవాలని నిర్ణయించుకున్నట్లయితే మీకోసం ప్రార్థిస్తాము.
లేదా అలా చేయాలని ఉన్నది నాకు శక్తి కావాలి, నా కోసం ప్రార్థించండి అని మీరంటున్నారా? అయితే మీ బైబిల్ మీద
చేయిఉంచి నాతోబాటు ప్రార్థించండి. ప్రార్థన:
ఇన్ని భాషలున్నాయికదా, ఇవన్ని ఎక్కడినుండి వచ్చాయి అని ఎప్పుడైనా ఆలోచించారా? అసలు భాష అనేది
ఎక్కడ ఎలా పుట్టింది అనే ప్రశ్న కూడా మీ మదిలో మెదిలి ఉండవచ్చు. కొందరంటారు కదా, మనము కోతిలోనుండి
మార్పుచెంది మానవులముగా మారామని? అదే నిజమైతే మరి జంతువులకు ఎందుకు భాష లేదు? ఈ ప్రశ్న
అడిగితే వారేమంటారు? లేదు లేదు, అదంతా పరిణామ సిద్ధాంతం. evolution theoryనిబట్టి ఎన్నో మార్పులు
కలిగాయి అంటారు.
పరిశుద్ధ గ్రంధం బైబిల్ మొదటి మానవుడు ఆదాముకు భాష తెలుసని స్పష్టం చేస్తుంది. ఆది. 2:19-20
గమనించండి. “19. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశపక్షిని నేలనుండి నిర్మించి, ఆదాము వాటికి ఏ
పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవముగల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు
దానికి కలిగెను. 20. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును
పేరులు పెట్టెను. అయినను ఆదామునకు సాటియైన సహాయము అతనికి లేక పోయెను.” అంతేకాదు, దేవుడు తన
వాక్కుద్వారా సమస్తసృష్టిని చేసినట్టు పరిశుద్ధ గంధం సెలవిస్తుంది. మొదటి అధ్యాయములో 9 సార్లు దేవుడు
“పలికెను” అని మనకు కనిపిస్తుంది. భాష పరిశోధకులు అంటున్నదేమిటి? అన్ని భాషలకు మూలమైన ఒకటే భాష
ఆదిలో ఉండిఉండాలి. సరిగ్గా బైబిల్ గ్రంధం చెప్పేది కూడా అదే! ఆ మొదటి భాషను దేవుడు తారుమారు చేయవలసిన
అగత్యత ఏర్పడింది. ఆది. 11:6-9లో ఈ విషయం సష్టంగా ఉన్నది. “6. అప్పుడు యెహోవా ఇదిగో జనము ఒక్కటే;
వారికందరికి భాష ఒక్కటే; వారు ఈ పని ఆరంభించియున్నారు.ఇకమీదట వారు చేయదలచు ఏపని యైనను
చేయకుండ వారికి ఆటంకమేమియు నుండదు. 7. గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి
తెలియకుండ అక్కడ వారి భాషను తారుమారు చేయుదము రండని అనుకొనెను. 8. ఆలాగు యెహోవా అక్కడ నుండి
భూమియందంతట వారిని చెదరగొట్టెను గనుక వారు ఆ పట్టణమును కట్టుటమానిరి. 9. దానికి బాబెలు అను పేరు
పెట్టిరి; ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారుచేసెను. అక్కడ నుండి యెహోవా
భూమియందంతట వారిని చెదరగొట్టెను.” భాషలను జాగ్రతగా గమనిస్తే వేరు వేరు భాషల కుటుంబాలు ఉన్నట్టు
తెలుస్తున్నది. భూమ్మీద ఉన్న ఒక్కొక్క ప్రాంతము, చెప్పాలంటే, ఐరోపా ప్రాంతము, హెబ్రీ దాని అనుబంధమైన
భాషలు, ఈ విధంగా కొన్ని భాషాకుటుంబాలు ఈ భూమ్మీద ఉన్నాయి. కాని పరిశుద్ధ లేఖనాలు రెండు భాషల్లో
దేవుడు మనకు అనుగ్రహించడానికి ఇష్టపడ్డాడు. అవే హెబ్రీ, గ్రీకు భాషలు. అపో. పౌలు ఈ రెండింటిలో కోవిదుడు,
మంచి పండితుడు. ఆయన అరెస్టు చేయబడ్డపుడు దేవలయములో ప్రజలతో హెబ్రీలో మాట్లాడాడు. అదే పౌలు ఏథెన్స్
మహానగరములోని ప్రముఖులతో గ్రీకులో మాట్లాడాడు. మనకు తెలిసిననతమట్టుకు ఆయన తన పత్రికలాన్ని గ్రీకులో
రాశాడు.
I కొరింథీ 14వ అధ్యాయములో దేవుని సంఘములో విశ్వాసులు సమావేశమైనపుడు భాషల స్థానమేమిటో
రాశాడు. మన ధ్యానంశo భాషకుండవలసిన సరైన స్థానం. లేఖన భాగం, I కొరింథీ 14: 10-13.
“10. లోకమందు ఎన్నో విధములగు భాషలున్నను వాటిలో ఒకటైనను స్పష్టముకానిదై యుండదు.
11. మాటల అర్థము నాకు తెలియకుండిన యెడల మాటలాడు వానికి నేను పరదేశినిగా ఉందును, మాటలాడువాడు నాకు పరదేశిగా ఉండును.
12. మీరు ఆత్మసంబంధమైన వరముల విషయమై ఆసక్తిగలవారు గనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగునిమిత్తము అవి మీకు విస్తరించునట్లు ప్రయత్నము చేయుడి.
13. భాషతో మాటలాడువాడు అర్థము చెప్పు శక్తికలుగుటకై ప్రార్థనచేయవలెను.”
అపో. ఈ లోకములో రకరకాలైన భాషలు లేదా స్వరములు ఉన్నవని చెబుతున్నాడు. ఒక్కొక్కటి వేరు వేరు
శబ్దములుగా వినిపిస్తూ ఉంటాయి. కొన్ని శబ్దాలు ఒక భాషలోనుండి మరొక భాషలోనికి తీసుకుంటూ ఉంటారు.
అందుచేత భాషల కుటుంబాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. మన దక్షిణ భారత దేశములోని భాషలలో ఒక భాషలోని
మాటకు మరొక భాషకు పోలిక కనిపిస్తూ ఉంటుంది. ఆ మాట, పలుకు అర్ధమై బోధపడ్డపుడే గ్రహింపు కలుగుతుంది.
మనము ఒకరము మరొకరితో మాట్లాడడానికి గల సాధనం ఒకే భాష. ఒకరు చెప్పేది మరొకరికి అర్ధం కాకపోతే ఏమి
చేయలేము. కొరింథీయులు ఆత్మీయవరములు పొందాలని ఎంతో తాపత్రయపడుతున్నట్టు అపో. గమనించాడు.
దానికంటే వారు వారి విశ్వాసమును బలపరచుకోవడం మీద, సంఘమును సంఘ విశ్వాసుల జీవితాలను కట్టడం
మీద ఎక్కువ శ్రద్ధ ఉంచాలి. ఒక అర్ధం కాని భాషలో మాట్లాడే వ్యక్తి దాన్ని అర్థమయ్యే భాషలోనికి తర్జుమా చేయించే
ఏర్పాటుచేయాలి. అర్ధం కాని భాషలో ఎవరైన మాట్లాడుతూ ఉంటే, ఆ వ్యక్తి తన ఆత్మతో మాట్లాడుతున్నాడేకాని, తన
మనసుతో కాదు. ఎవరినా అన్య భాష, లేదా ఇతర భాషలో ఏదైనా సత్యము మాట్లాడుతున్నట్లయితే దాని అర్ధం
వినేవారికి చెప్పే శక్తి కావాలాని ప్రార్థన చేయాలి. కాబట్టి, భాషలు వాటి హద్దుల్లో ఉండాలి, మితంగా ఉండాలి. వాటి అర్ధం
చెప్పే వ్యక్తి లేనట్లయితే భాషలతో మాట్లాడే వ్యక్తి మాట్లాడకూడదు.
తరువాతి అంశము భాషలను గ్రహించడం, సముచితంగా వినియోగించడం. I కొరింథీ 14: 14-19
“14. నేను భాషతో ప్రార్థన చేసినయెడల నా ఆత్మ ప్రార్థనచేయును గాని నా మనస్సు ఫలవంతముగా ఉండదు.
15. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతోను ప్రార్థన చేతును; ఆత్మతో పాడుదును, మనస్సుతోను పాడుదును.
16. లేనియెడల నీవు ఆత్మతో స్తోత్రము చేసినప్పుడు ఉపదేశము పొందనివాడు నీవు చెప్పుదానిని గ్రహింపలేడు గనుక, నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఆమెన్ అని వాడేలాగు పలుకును?
17. నీవైతే బాగుగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నావు గాని యెదుటివాడు క్షేమాభివృద్ధి పొందడు.
18. నేను మీ యందరికంటె ఎక్కువగా భాషలతో మాటలాడుచున్నాను; అందుకు దేవుని స్తుతించెదను.
19. అయినను సంఘములో భాషతో పదివేల మాటలు పలుకుటకంటె, ఇతరులకు బోధకలుగునట్లు నా మనస్సుతో అయిదు మాటలు పలుకుట మేలు.
పౌలు భాషలు తప్పని కాని, పాపభూయిష్టమని కాని చెప్పడం లేదుగాని, వాటిని ఎలా గ్రహించాలో, వాటికి
సముచితమైన స్థానం, ఉపయోగం ఏమిటో స్పష్టంగా బోధిస్తున్నాడు. సహవాసానికి సంభాషణకుఅవసరమైనది
అవగాహన, గ్రహింపు. పౌలు అంటున్నదేమిటి? ఒక వ్యక్తి భాషల్లో ప్రార్ధించినపుడు అతడు ఆత్మలో ప్రార్థిస్తున్నాడు.
మనసుతో కాదు. అతడు భాషల్లో పడుతున్నట్లయితే ఆత్మలో పాడుతున్నాడు, మనసుతో కాదు. అతడు భాషల్లో
మాట్లాడుతున్నా, ప్రార్థిస్తున్నా, లేదా పడుతున్నా, అప్పుడే లోనికి వచ్చినవ్యక్తి ఏమని అర్ధం చేసుకుంటాడు? అర్ధo
చేసుకోలేదు కాబట్టి, అమెన్ అని చెప్పలేడు, వాటితో ఏకీభవించలేడు. మీకు అర్ధం కాని వాటికి మీరు అమెన్ అని
చెప్పగలరా? పౌలు చెప్పేదేమిటంటే భాషలు అంతరంగములో వ్యక్తిగత జీవితములో వాడవలసినవి, సమూహాల్లో,
అందరి ముందు కాదు. లేదా అందరిముందు, విశ్వాసుల మధ్యలో మాట్లాడాలని ఆశిస్తే, వాటి భావము చెప్పాలి. 19వ
వచనం గమనించాలి. ఎవారికీ అర్ధం కాని పదివేల మాటలు మాట్లాడేదానికంటే, అందరినీ ధైర్యపరచి, కట్టి, వారి
విశ్వాసాన్ని బలపరిచే మాటలు ఐదు మాటలు మాట్లాడినా చాలు! భావము చెప్పేవారు లేనప్పుడు భాషలతో
అందరిముందు మాట్లాడకూడదు. శ్రోతలూ, గమనించారా? భాషలకు సముచిత స్థానం, సరైన స్థానం ఉన్నది. సరైన
స్థానములో ఉన్నపుడే అవి సంఘమునకు, సంఘపు క్షేమమునకు, అభివృధ్డికి సహాయపడతాయి. మనమంతా, ప్రతి
ఒక్కొక్కరు మన తోటి విశ్వాసులకు ప్రోత్సాహకరంగా, జీవించడానికి, ఇతర విశ్వాసులను బలపరచి వారి
విశ్వాసమును బలపరచి వారి జీవితాలను కట్టడానికి, ప్రభువు మహా బలమైన చేతిలో సాధనములుగా రూపాంతరం
చెందుదుము గాక! అమెన్!
> II Cor-15 2 ~~ 12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము శ్రోతలూ , బాగున్నారా ? ప్రస్తుత ప్రపంచ...