I కోరింథీ-48 13:4-7 ప్రేమ తోటివారితో కూడా కలిసి దయతో సానుభూతి చూపుతుంది

 

I కోరింథీ-48  13:4-7

ప్రేమ తోటివారితో కూడా కలిసి దయతో సానుభూతి చూపుతుంది

         ప్రస్తుతం మీరు ఏ వేదనతో బాధతో సమతమవుతున్నారో పరిపూర్ణంగా తెలిసినవారు ఒకరున్నారు. ఆయనే 

యేసు క్రీస్తు ప్రభువు. ఆయనకు నిజంగా మన వేదనలన్నీ తెలుసునని మీరు నమ్ముతున్నారా? నేను 

నమ్ముతున్నాను. I పేతురు 5:7లో “ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు అని పరిశుద్ధ గ్రంధం స్పష్టంగా 

చెబుతున్నది. ఇది అందరికీ వర్తిస్తుందా? కాదు, యేసు క్రీస్తు రక్తముద్వారా, తమ పాపములకు క్షమాపణ పొంది,  

దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగి ఉన్నవారికి మాత్రమే! మీకు ఈ సంబంధం ఉన్నట్లయితే, మీలో జీవిస్తున్న 

పరిశుద్ధాత్ముడు మీ పాపము గూర్చి ఎప్పటికప్పుడు మిమ్మల్ని ఒప్పిస్తూఉంటాడు. పాపము ఒప్పుకొని 

శుద్ధిచేయబడేవరకు సంబంధములో అంతరాయం ఏర్పడుతుంది. మొదట దాన్ని సరిచేసుకోవాలి. మీకింకా ఆ 

సంబంధం లేకపోతే మొదట మీరు చేయవలసిన ప్రార్థన మీ పాపపుస్థితి ప్రభువుతో ఒప్పుకొని సంబంధం కలిగేలా 

ప్రయాస పడడం. 

ఈనాటి మన ధ్యానంశo: ప్రేమ తోటివారితో కూడా కలిసి దయతో సానుభూతి చూపుతుంది. లేఖన భాగము: I కొరింథీ 13:4-7

4. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు; ప్రేమ డంబముగా ప్రవర్తింపదు; అది ఉప్పొంగదు;

          5. అమర్యాదగా నడువదు; స్వప్రయో జనమును విచారించుకొనదు; త్వరగా కోపపడదు;           అపకారమును మనస్సులో ఉంచుకొనదు.

          6. దుర్నీతివిషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును.

7. అన్నిటికి తాళుకొనును, అన్నిటిని నమ్మును; అన్నిటిని నిరీక్షించును; అన్నిటిని ఓర్చును.

ఈ లేఖన భాగములో రెండు అంగీకారభావనలు ఉన్నవి. ఆ తరువాత ఎనిమిది నిషేధాత్మకమైన సంగతులు, ఆ 

తరువాత అయిదు నిశ్చయపరిచే రూఢిచేసే సంగతులు ఉన్నవి.ప్రేమ దయ చూపించును. ప్రేమ ఎక్కువ కాలము 

సహిస్తుంది, దయ చూపుతుంది.  సహనము అంటే కష్టమును ఒప్పుకొని భరించడం. సహనము, లేదా ఓపిక 

మనము అనుదినము వాడే మాటలో సులభంగా కోపగించుకోకుండా ఉండడం అనే భావన ఇమిడి ఉంది.

దయ అనే మాటలో మృదుత్వము సాత్వికత కనిపిస్తుంది. త్వరగా ఆవేశానికి లోనుకాదు. త్వరగా కంగారుపడదు. 

ఓపిగ్గా, దయతో ఎదురుచూచ్తుంది.

         ఇప్పుడు ఎనిమిది నిషేధాత్మకమైన సంగతులేమితో చూద్దాం.  ఈ ఎనిమిదింటిని పండులోనుండి తొణలు 

తీసేసినట్టు తీసేస్తే, అప్పుడు ప్రేమ అంటే ఏమిటో అర్థమవుతుంది.

         ప్రేమ మత్సరపడదు. ప్రేమలో అసూయ ఉండదు. అసూయకు బానిస కావడం ఎంత సులభంకదూ! మన 

పొరుగువాళ్ళను కాని, స్నేహితులనుకాని, బంధువులలో ఎవరినైనా చూసినపుడు, వాళ్ళకు ఉన్న వస్తువులు, 

ఆస్తులు, అంతస్తు మనకు లేకపోతే, ‘మనకు కూడా అదిఉంటే ఎంత బాగుండు ఇది సర్వసాధారణంగా జరుగుతున్నదే, 

కానీ మనము దాన్ని అసూయ అని పిలవము, సరికదా సమర్ధించుకుంటాo. ఇది అసూయకు చక్కని వివరణ.

         ప్రేమ డంబముగా ప్రవర్తింపదు. ప్రేమ ఉన్నవారు గొప్పలు చెప్పుకోరు. ఆడంబరముగా జీవించరు. ఇంతెందుకు? 

ఎప్పుడూ మాట్లాడుతూ ఉండదు. ఎప్పుడూ తమాగురించి తాము చెప్పుకుంటూ ఉండేవారిని తరచూ చూస్తూ 

ఉంటాము. ప్రేమ గొప్పలు చెప్పుకోదు గాని, ఎప్పుడు నిశ్శబ్దంగా ఉండాలో ప్రేమకు బాగా తెలుసు.

         ప్రేమ ఉప్పొంగదు. ప్రేమ గర్వపడదు. అహంకారముతో పొగరుగా మాట్లాడాడు, ప్రవర్తించదు. నేనే నా క్లాసులో, 

నా గ్రూపులో, మా కాలనీలో, మా ఊళ్ళో నెంబర్ వన్ అని చెప్పుకోదు.

         ప్రేమ అమర్యాదగా నడవదు. మర్యాద అన్న మాటను జాగ్రత్తగా గమనిస్తున్నారా? ఈ దినాల్లో మర్యాదలు 

పాటించేవారు చాలా అరుదు అంటే ఆశ్చర్యం కాదేమో! ఎవరిగురించైనా మాట్లాడేటప్పుడు వారి వెనక మర్యాదగా 

మాట్లాడుతున్నారా? ఎదురుగానే ఎన్ని మర్యాదలు చేసి అవతల నీచమైన మాటలతో అమర్యాదగా ప్రవర్తిస్తున్నారా? 

ప్రస్తుతపు మన లోకపు పరిస్థితులలో, లోక మర్యాదలో మనo కూడా కలిసిపోయామా?  మాట, చూపు, ప్రతిస్పందన, 

క్రియలు, ఆలోచనలు అన్నింటిలో మర్యాదగా నడవడం ప్రేమకు అద్భుతమైన ప్రతీక!

         ప్రేమ స్వప్రయోజనమును విచారించుకొనదు. దీని అర్ధమిమిటి? ప్రేమలో స్వార్ధానికి తావులేదు. ప్రేమ 

ఉన్నప్పుడు మనగురించి మనము ఆలోచించుకోము కానీ ఎదుటి వల్ల గూర్చి ఆలోచిస్తాము. అది భార్య కావచ్చు. భర్త 

కావచ్చు, పిల్లలు కావచ్చు. సంఘవిశ్వాసులు కావచ్చు, నీ “పొరుగువాడు” ఎవరైనా కావచ్చు. మన ప్రభువు చెప్పిన  

మంచి సమరయ్యుని ఉపమానం ఏ సందర్భములో చెప్పారో జ్ఞాపకం తెచ్చుకోండి.

         ప్రేమ త్వరగా కోపపడదు. అనగా ప్రేమ ఉన్నప్పుడు సులభంగా కలవరపడము. అంత సులభంగా 

మండిపడరు. కొందరిని గమనించినపుడు వారి కనుబొమ్మలలోనే వారి కలవరము, కోపము, ఆవేశము కనిపిస్తూ 

ఉంటుంది. ప్రతి చిన్నదానికి విసుక్కుంటూ ఉంటారు, నిరాశ, విసుగు ప్రేమలేనితనమునకు మంచి ముంగుర్తులు.

         ప్రేమ కీడును మనసులో ఉంచుకొనదు. ఇతరులు చేసిన అపకారమును, కీడును, దోషాలను భద్రంగా 

మనసులోని అంతర్భాగాలలో దాచుకొని, నెమరు వేసుకోదు. మంచి ఉదాహరణ. వారు ఏనుగులాగా ఉంటారు. అంటే 

లావుగా ఉంటారని కాదు, ప్రవర్తనలో. వారెప్పుడు మర్చిపోరు. కొన్ని కుటుంబాల్లో, సంఘాల్లో, సమాజాల్లో కక్ష, 

వైరము తరాల నుండి అలాగే దాచిపెట్టుకుంటూ ఉంటారు, ప్రియ సోదరీ, సోదరులారా? మీలో ఇది ఉన్నట్లయితే, మీలో 

విశ్వాసము, ప్రేమ లేదని స్పష్టంగా మీమీద మీరే సాక్షమిస్తున్నారు. అన్ని దోషాలను, తప్పుగా మాట్లాడిన మాటలను, 

పనులను, నష్టాలను, దేప్పేస్తూ, జ్ఞాపకం చేస్తూఉంటారు. ఇది మనలో ఉంటే, యేసయ్య తన క్రియను మనలో 

చేయడానికి అంగీకరించి, వీటన్నిటికి ఆయన రక్తములో కడుక్కోవాలి.

         దుర్నీతి విషయమై సంతోషించదు. దుర్నీతి అంటే ఏమిటి? కుట్రతో, కుతంత్రముతో వంకర మార్గము, పద్ధతి, 

ప్రవర్తనతో జీవించడం. ఇతరులలో ఎన్నో దోషాలు, మనస్పర్థలూ, తప్పులూ మనo చూస్తూ ఉంటాము. కాని, వాటి 

గురించి ఇతరులతో మాట్లాడకూడదు. హేళన, ఎగతాళి, విమర్శలు చేయకూడదు. సంతోషించకపోవడమంటే అర్ధం ఇదే.

         ఇక అయిదు రూఢిపరిచే సంగతులు తెలుసుకుందాం.

         ప్రేమ సత్యములో సంతోషిస్తుంది. ఇది ఎంత అద్భుతమైన సత్యమో ఎప్పుడైనా ఆలోచించారా?

ప్రేమ సత్యములు దేవునిలో ముడిపడి ఉంటాయి. దేవుని కుటుంబములో ఉన్నవారు దేవునిలో నిలిచిఉండేవారు, 

యేసు క్రీస్తు ప్రభువునందు నిలిచి ఉండేవారు, అలాగే ఉండాలని దేవుని ఆజ్ఞ. మన హృదయాల్లో, జీవితాల్లో కూడా 

ప్రేమ సత్యము ఎల్లప్పుడూ నిండుగా ఉండాలి.

         ప్రేమ అన్నిటిని సహిస్తుంది. వేచి ఉండడానికి సిద్ధంగా ఉంటుంది. ప్రేమ బలవంతం చేయదు. క్లిష్ట పరిస్థితుల్లో 

కూడా ఇతరులమీద వారి స్వార్ధాన్ని, ఇష్టాన్ని రుద్దదు. క్లిష్ట పరిస్థితులను, క్లిష్టమైన ప్రజలను సహించి ఓపిక 

పడుతుంది.

         ప్రేమ అన్నిటిని నమ్ముతుంది. దీని అర్ధం మోసము చేస్తున్నప్పుడు కూడా గుడ్డిగా నమ్ముతుందని కాదండీ! 

అపార్థం చేసుకోకండి. నిత్యమైన సత్యమైన ప్రేమగల దేవుడు మనలను ఎలా నమ్ముతున్నాడు? ఇంకా ఈ రోజైనా, 

నీవు నీ హృదయమును ఆయనకిచ్చి నూతన సృష్టిగా మారతావని ఇంకా నమ్ముతున్నాడు కదా! దేవుని ప్రేమ 

కలిగిన వారు తగిన రీతిగా దేవునిలాగానే నమ్మగలుగుతాము.

         ప్రేమ అన్నిటిని నిరీక్షిస్తుంది. నిరీక్షణ అంటే కేవలం ఇలా అయితే బాగుండు అనుకోవడం కాదు! పౌలు 

బోధిస్తున్న నిరీక్షణ దేవునిలో స్థిరంగా ఉంది. దేవునిలో ఉండే మన నిరీక్షణ తొణికేది కాదు. ఊగిసలాడేది కాదు. 

దేవునిలో ఉండే మన నిరీక్షణ నిశ్చలంగా స్థిరంగా ఉంటుంది, హల్లెలూయ!

         ఇక చివరలో, అన్నిటిని ఓర్చుకుంటుంది. పరీక్ష ఎదురొచ్చినపుడు ప్రేమ నిటారుగా నిలబడుతుంది, నిబ్బరంగా 

ఉంటుంది. ప్రేమ ఉన్నపుడు ఎలా ఉంటాము? అనే ప్రశ్నకు ఇక్కడ జవాబుదొరుకుతుంది.  

ప్రేమ తోటివారితో కూడా కలిసి దయతో సానుభూతి చూపుతుంది.

అవును, ప్రియ సోదరీ సోదరులారా, ఎనిమిది నిషేధాత్మకమైన సంగతులు, అయిదు రూఢిపరిచే సంగతులు ప్రేమలో 

ఉన్నట్టు తేటగా తెలుసుకున్నాం. మీలో, నాలో ఈ ప్రేమ నిండారుగా నిలిచి ఉండడానికి ప్రభువు కృప తన పరిశుద్ధాత్మ 

ద్వారా సమృద్ధిగా మనకందరికీ అవసరం. ప్రభువు తన సర్వ సమృద్ధికొలది మీలో ప్రతి ఒక్కరికీ, ఒక్కొక్కరికీ 

ధారాళముగా అనుగ్రహించుగాక!

II కొరింధీ -15 2~12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము

>   II Cor-15   2 ~~ 12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము          శ్రోతలూ , బాగున్నారా ? ప్రస్తుత ప్రపంచ...