I కోరింథీ-40 12:1-11 పరిశుద్ధాత్ముని పరిచర్య

 

I కోరింథీ-40  12:1-11

పరిశుద్ధాత్ముని పరిచర్య 

           

     ఎలా ఉన్నారు? మీ ప్రార్థన అవసరతలు, ప్రభువు వాక్య అధ్యయనం ద్వారా మీరు పొందుతున్న హెచ్చరికలు, 

మీలో జరుగుతున్న మార్పులు తెలియచేస్తూ ఒక ఉత్తరం వ్రాయండి. అడ్రసు అడుగుతూ మెసేజ్ పెట్టినట్లయితే మీకు 

అడ్రసు పంపించగలము. లేదా వాట్సప్ లో వ్రాయండి, ఆడియో మెసేజ్ పంపండి. ఫోన్ చేసి వివరంగా తెలియచేయండి. 

మీరు బైబిల్ ప్రతి దినం చదివి ధ్యానిస్తున్నారా? మీలో ప్రతి ఒక్కరికోసం, ఒక్కొక్కరికోసం ప్రార్థిస్తున్నాము. మీరు పంపే 

వివరాలు ప్రార్థన చేయడానికి వీలుగా ఉంటాయి. ప్రార్థన:   

         ప్రతి మానవ ప్రతిపాదనను ఎంతవరకైనా తరచి చూడవచ్చు, లాగవచ్చు. ఉదాహరణకు, ఇతరుల విషయం 

ఆలోచించకుండా స్వేచ్ఛను స్వార్ధం, లేదా స్వంత ఇష్టం వరకు లాగవచ్చు. క్రైస్తవ సిద్ధాంతాలలో కూడా అలాగే కొన్నిటిని 

ఎంత దూరమైనా లాగవచ్చు. బైబిల్ బోధనను దానిలోని మార్పులను గమనిస్తే కొందరికి ఇంపుగా ఉండక పోవచ్చు, 

ఇష్టపడక పోవచ్చు. I కోరింథీ 12:1-11లో ఆత్మీయ వరములను వినియోగించే విషయము కొన్ని వివాదాస్పదమైన 

సంగతులు ఉన్నాయి. పరిశుద్ధాత్ముని పరిచర్య విషయం పౌలు బోధించిన వాటిని ఈ పూట అధ్యయనం చేద్దాం, రండి, 

రేడియోకు దగ్గరగా కూర్చోని సావధానంగా వినoడి. ఈ లేఖన భాగము ఆధారంగా పరిశుద్ధాత్ముని పరిచర్య అనే 

అంశమును పరిశుద్ధగ్రంధములో ఉన్నదున్నట్టుగా ధ్యానించి, అధ్యయనం చేయడానికి ప్రయత్నము చేద్దాం.

         మొదటి అంశం పరిశుద్ధాత్ముని అగత్యత, ఆవశ్యకత.  I కోరింథీ 12:1-3.

            1. మరియు సహోదరులారా, ఆత్మసంబంధమైన వరము లనుగూర్చి మీకు తెలియకుండుట     నాకిష్టము లేదు.

            2. మీరు అన్యజనులై యున్నప్పుడు మూగ విగ్హములను ఆరాధించుటకు ఎటుపడిన అటు నడిపింపబడితిరని మీకు తెలియును.

            3. ఇందుచేత దేవుని ఆత్మవలన మాటలాడు వాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు,

         పరిశుద్ధాత్మవలన తప్ప ఎవడును యేసు ప్రభువని చెప్పలేడనియు నేను మీకు  తెలియజేయుచున్నాను."

కోరింథీ సంఘపువిశ్వాసులు పరిశుద్ధాత్ముని పనిని, పరిచర్యను తెలుసుకోవాలని పౌలు కోరుతూ ఉన్నాడు. ఈనాడు మనము చేసే అధ్యయనము ఉద్దేశ్యము కూడా అదే! పరిశుధ్ద్ధాత్ముని పనిని పరిచర్యను మనమంతా తెలుసుకోవాలి. ఈ అద్భుతమైన బోధ గురించి వారికి ఎలాంటి అనుమానము ఉండకూడదని ఆయన కోరిక. పరిశుద్ధాత్ముడు మనకందరికీ తప్పనిసరిగా అవసరం. మనము తెలుసుకున్నపుడే ఎదిగి అభివృద్ధి చెందుతాము. మన మనసులు, ఆత్మలు తెలివి, జ్ఞానమును ఆశిస్తాయి. నేర్చుకునే ఆశతో మనము సృష్టించబడ్డాము. మన జ్ఞాపకాలను మనసుల్లో భద్రం చేసుకునే శక్తితో మనము నిర్మించబడ్డాము.

         పౌలు కోరింథీయులకు వారి గతమును జ్ఞాపకము చేస్తున్నాడు. జన్మతో వారు యూదేతరులని వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. వారు నిర్జీవమైన మూగ విగ్రహములను ఆరాధించినవారని, ఎటుబడితే అటు పోయినవారని వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. “అన్యులు” అని వారిని సంబోధిస్తున్న ఈ విషయాన్ని మనము అర్ధం చేసుకోవాలి. పాత నిబంధనలో మానవ జాతి అంతటినీ రెండు గుంపులుగా విభాగించారు. హెబ్రీ భాషలో చెప్పాలంటే, “అమ్మీము” “గోయీము” అని రెండు గుంపులుగా విభజించారు. “అమ్మీము” అంటే ఇశ్రాయేలు సంతానమైన ప్రజలు. వారే యూదులు, దేవుని కుటుంబం: “గోయీము” అంటే నాస్తికులు, దేవుని నెరుగనివారు. యూదులు కానివారంతా “గోయీము” అని పిలువబడతారు. వారిని గూర్చి పౌలు అంటున్న మాటలు గమనించండి: మీరు అన్యజనులై యున్నప్పుడు మూగ విగ్హములను ఆరాధించుటకు ఎటుపడిన అటు నడిపింపబడితిరని మీకు తెలియును.” వాళ్ళను గురించి పౌలు చెప్పిన మాటలు, అన్యజనులు, మూగ విగ్రహములను ఆరాధిస్తూ, ఎటు బడితే అటు పోయినవారు.

         పౌలు పరిశుద్ధాత్ముని అగత్యతను, అవశ్యకతను ఇక్కడ నిర్వచిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు యేసు క్రీస్తు ప్రభువునకు అత్యంత సన్నిహితుడు. యేసు క్రీస్తు ప్రభువు పరిశుద్ధాత్మను మనకు వాగ్దానం చేసినపుడు, ఆయన వచ్చి, తనవాటన్నిటిని మనకు చూపిస్తాడని చెప్పాడు. పరిశుద్ధాత్ముడు యేసు క్రీస్తు ప్రభువునకు ఎంత సన్నిహితుడంటే, ఆయనలోనే ఉంటాడు. పౌలు బోధ ఏమిటంటే, పరిశుద్ధాత్మను కలిగినవారెవ్వరూ యేసు క్రీస్తు శాపగ్రస్తుడని చెప్పడు, చెప్పలేడు.  యేసు క్రీస్తు తమ ప్రభువని చెప్పే వారెవ్వరూ పరిశుద్ధాత్మ వారిలో లేనిది చెప్పలేరు. ఆయన మాటలు ఏమిటి?పరి శుద్ధాత్మవలన తప్ప ఎవడును యేసు ప్రభువని చెప్పలేడు.” ఈ పదునైన వ్యత్యాసము గమినిస్తున్నారా, శ్రోతలూ? మనము యేసు క్రీస్తును మన ప్రభువని హృదయ పూర్వకంగా ఒప్పుకుంటే, అది పలికించేది మనలో ఉన్నపరిశుద్ధాత్ముడే! హల్లెలూయ! దీనికి రెండవ అనుభవం అవసరం లేదు. ఒక వ్యక్తి యేసు క్రీస్తును తన హృదయపు ప్రభువుగా స్వీకరిస్తే, ఆ వ్యక్తి పరిశుద్ధాత్మను పొందినవాడు.

         పెంతెకొస్తునాడు “మేమేమి చేతుము?” అని వారడిగిన ప్రశ్నకు పేతురు జవాబు గమనించండి. అ. కా. 2:38-39. 38. పేతురు మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి; అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. 39. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్థులందరికిని, అనగా ప్రభువైన మన దేవుడు తనయొద్దకు పిలిచిన వారికందరికిని చెందునని వారితో చెప్పెను.”  “యేసు ప్రభువు” మన జీవితాలకు ప్రభువు అనే ఒప్పుకోలు ఆ విశ్వాసమును ధృవీకరిస్తున్నది. అనగా యేసు క్రీస్తు ప్రభువు నీ వ్యక్తిగత జీవితానికి ప్రభువు అని నీవు ఒప్పుకుంటే, ఆయన నీ పాపములను కడిగి శుద్ధి చేశాడని, ఆ విశ్వాసములో నీవు జీవిస్తున్నట్లయితే, పరిశుధ్ద్ధాత్ముడు నీలో జీవిస్తున్నట్టు. అది కేవలము పరిశుద్ధాత్ముని ఆదేశము ద్వారా మాత్రమే, ఆ మాటలు చెప్పగలుగుతారు. పరిశుద్ధాత్మ లేకుండా ఎవ్వరూ కూడ “యేసు ప్రభువు” తన జీవితానికి ప్రభువు అని చెప్పలేరు, ఒప్పుకోలేరు, సాక్ష్యమియ్యలేరు.  దాని అర్ధo ఏమిటంటే, ఆ వ్యక్తి యేసు క్రీస్తు తన వ్యక్తిగత ప్రభువని నమ్మి ఒప్పుకుంటున్నట్టు. కాబట్టి మొదటి మూడు వచనాలు పరిశుద్ధాత్ముని అగత్యతను మనకు స్పష్టంగా చూపిస్తున్నాయి.

ప్రియ సోదరుడా, సోదరీ, నీ హృదయుములో నీ అంతట నీకు యేసు క్రీస్తు ప్రభువుతో వ్యక్తిగత సంబంధము ఉన్నదా? ఉంటే, ఆ సంబంధమును బలపరచుకోవడానికి ప్రతి దినం దేవుని స్వరము పరిశుద్ధాత్ముని ద్వారా వింటున్నావా? విన్నంత మాత్రాన ఏమీ జరగదు. మేలు కలుగదు. విధేయత చూపి జీవన విధానములో, నిర్ణయాలలో, భావోద్రేకాలలో, ఆలోచనలలో నీవు పరిశుద్ధాత్మునికి ప్రథమస్థానం ఇస్తే, దేవుని వాక్యముద్వారా ఆయనతో నీ సంబంధమును సరి చేసుకోవచ్చు. అందుకు నీవు సిధ్ధమా?   

 

II కొరింధీ -15 2~12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము

>   II Cor-15   2 ~~ 12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము          శ్రోతలూ , బాగున్నారా ? ప్రస్తుత ప్రపంచ...