రోమా పత్రిక అధ్యయనం - 31 8:31-39 దేవునిలో సంక్షేమంగా...

 

  • చాలా మంది వృద్ధులు పెద్ద అక్షరములే చదువగలిగినందు చేత పెద్ద అక్షరములు వాడుతున్నాము. 

    దేవుని వాక్య పారాయణం చేసి దైవాశీస్సులు  పొందండి.  మీరు ఏ విధమైన దీవెనలు పొందారో కామెంట్స్ లో   వ్రాయండి,  మీ ప్రార్ధన మనవులు తెలియ చేయండి. మీకోసం ప్రార్ధిస్తాం.  sajeevanireekshana@gmail.com ఇ-మెయిల్  లేదా వాట్సప్ 9866 341 841 ద్వారా నైనా తెలియచేయండి. 

  • Please let us know your prayer requests. We will pray for you. Please send an e-mail to sajeevanireekshana@gmail.com. 

  • Or send a message by Whats App to 98663 41841

     

    రోమా పత్రిక అధ్యయనం  - 31    8:31-39

    దేవునిలో సంక్షేమంగా...

     

         హల్లెలుయా! దేవునికి స్తోత్రం!! ఎలా ఉన్నారు? “సజీవ నిరీక్షణ” ద్వారా మీరు ఏ విధమైన ధైర్యం, 

    హెచ్చరికలు, దీవెనలు, ఆశీర్వాదాలు పొందుతున్నారో తెలియచేయకూడదూ?  మీ జీవిత విధానములో 

    మార్పులు కలుగుతున్నాయా? మీ ప్రార్థన అవసరతలు, అంశాలు మాకు తెలియచేయండి. బైబిల్ అనుదినం 

    క్రమo తప్పకుండ చదువుతున్నవారు ఆ విషయం మాకు తెలియచేసినట్లయితే మీరు ముగించడానికి ప్రభువు 

    మీకు శక్తి, కృప పట్టుదల అనుగ్రహించాలని మీ కోసం ప్రార్థిస్తాము. ఆ విషయం మాకు తెలియచేయవచ్చు. మా 

    ఫోన్ నంబర్ 9866341841 ఈ ఫోన్లో వాట్సప్ కూడా ఉన్నది. లేదా ఉత్తరం రాయాలనుకుంటే, sms  

    లోగాని,  వాట్సప్ లోగాని, మీరు అడిగినట్లయితే అడ్రసు పంపిస్తాo. కరోన విషయంలో తగిన జాగ్రతలు 

    తీసుకోవడం మర్చిపోకండి! అలసత్వంగా, నిర్లక్ష్యంగా ఉంటే తరువాత దుఖపడే సమయం రావచ్చు.


         మీరు భయపడుతున్నారా? చుట్టూ జరుగుతున్నవి చూచి, విని ఆoదోళన చెందుతున్నారా? అయితే మీ 

    బైబిల్ తెరిచి ఈ నాటి లేఖన భాగమును ప్రశాంతంగా చదవండి: 

     

                  31 ఇట్లుండగా ఏమందుము? దేవుడు మనపక్షముననుండగా మనకు విరోధియెవడు?
                 

    32 తన సొంతకుమారుని అనుగ్ర హించుటకు వెనుకతీయక మన అందరికొరకు ఆయనను అప్పగించినవాడు 

     ఆయనతో పాటు సమస్తమును మన కెందుకు అనుగ్రహింపడు?
     

                33 దేవునిచేత ఏర్పరచబడిన వారిమీద నేరము మోపు వాడెవడు? నీతిమంతులుగా తీర్చు వాడు      

    దేవుడే;
     

                34 శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తుయేసే; అంతే కాదు, మృతులలోనుండి            

     లేచినవాడును దేవుని    కుడి పార్శ్వమున ఉన్నవాడును మనకొరకు విజ్ఞాపనము కూడ         

    చేయువాడును ఆయనే
                 

    35 క్రీస్తు ప్రేమనుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమయైనను బాధయైనను హింసయైనను         

    కరవైనను వస్త్రహీనతయైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపునా?
     

                 36 ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా నిన్ను బట్టి దినమెల్ల మేము వధింపబడినవారము        

    వధకు   సిద్ధమైన గొఱ్ఱలమని మేము ఎంచబడిన వారము.
     

               37 అయినను మనలను ప్రేమించినవాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము      

    పొందుచున్నాము.

    38 మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవియైనను రాబోవున          వియైనను 

    అధికారులైనను ఎత్తయినను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను,
     

                39 మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమనుండి మనలను ఎడబాపనేరవని రూఢిగా  

    నమ్ముచున్నాను.

     ఇవి దేవుని ప్రశస్తమైన మాటలు. ఒక మానవుని మాటలు చదివినట్టు చదివినా, ఆ విధంగా భావించి   

    విన్నా, ఏ ప్రయోజనము ఉండదు. పౌలు గారు నాలుగు ప్రశ్నలు అడుగుతున్నారు, వాటికి సమాధానం 

    కూడా ఇస్తున్నారు. వీటిని పరిశీలిద్దాం, రండి, రేడియోకు దగ్గరగా వచ్చి, నెమ్మది కూర్చోని సావధానంగా 

    వినండి.

    మొదటి ప్రశ్న మనకు విరోధి ఎవడు? శత్రువుల్లో ఉన్న శక్తితో మన శక్తిని పోల్చుకుంటే, మనశక్తి తక్కువే. 

    ఈ ప్రశ్నకు ముందు ఉన్న రెండు మాటలు, అత్యసరమైన మాటలు. అవేమిటి? “దేవుడు 

    మనపక్షముననుండగా” ఈ మాటల్లో మనకు ధైర్యము కనిపిస్తున్నది. ఈ మాటల అర్ధం దేవుడు 

    మనపక్షముగా నున్నప్పుడు ఎవ్వరూ మనకు విరోధముగా ఏది చేయలేరు. ఇది మన జీవితాల్లో 

    జరగాలంటే ఏమి చేయాలి? దేవుడు మనలను రక్షిస్తాడు అని ధ్రుడంగా నమ్మితే అప్పుడు మనము భద్రంగా, 

    ధైర్యంగా జీవించగలము. ఆయనే మనకు కేడెముగా ఉంటాడు. కేడెము యుద్ధముచేసే వారికి అత్యవరసరం. 

    ఒక సైనికుడు కేడెము ఎల్లప్పుడు తన ఎడమ చేతికి కట్టుకుంటాడు. శత్రువు బాణము వేసినపుడు, కత్తితో 

    యుధ్ధము చేసినపుడు వెంటనే దానినుండి కాపాడుకుంటాడు. అదే రీతిగా నీవు నేను దేవుని మాటలను 

    నమ్మినపుడు, ఆ విశ్వాసమే మన కేడెము. హల్లెలుయా! సర్వశక్తిమంతుడైన దేవుడు, మనలను 

    ప్రేమిస్తున్న తండ్రిగా, మనగురించి బాధ్యత వహించే రక్షకునిగా మనతో ఉండి మనమేదుర్కొనే అన్నీ క్లిష్ట 

    పరిస్థితులలో మనలను కాపాడి భద్రపరుస్తాడు. సోదరీ, సోదరులారా, యేసు క్రీస్తు ప్రభువు సర్వాధికారము 

    కలిగిన దేవుడు, పరలోకములో తండ్రి కుడిప్రక్కలో కూర్చోని నీ కోసం, నా కోసం విజ్ఞాపన చేస్తున్న రక్షకుడు. 

    ఆయనను నీవు నమ్మావా? నీ వ్యక్తిగత రక్షకుడిగా చేసుకున్నావా? అయితే ఆయన నీ చేయి విడువడు, 

    నిన్ను మరువడు. విశ్వసించడానికి నీవు సిద్ధమా? చాలామంది నమ్ముతున్నామనుకుంటారు, గాని వారిలో 

    బలమైన అనుమానము ఉంటుంది, నీవు నిజముగా క్రీస్తునందు విశ్వాసముంచిన వ్యక్తివైతే ప్రభువు నిన్ను 

    నిజముగా కాపాడుతాడు, నడిపిస్తాడు, భద్రపరుస్తాడు. ఆయన ఎంతైనా నమ్మదగినవాడు!!

           రెండవ ప్రశ్న నేరము మోపువాడెవడు?   వింటున్నారా? అది 33వ వచనములో ఉన్నది. 

    దేవునిచేత ఏర్పరచబడిన వారిమీద నేరము మోపు వాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే;”  నీవి 

    చేశావు అని మన మీద నేరము మోపగలవారెవరు? అని పౌలు గారు ప్రశ్నిస్తున్నారు. నిందలు మోపేవారు 

    ఉన్నారు. మన ప్రభువు క్రీస్తు మనమీద ప్రజలు నిందలు మోపినపుడు సంతోషించమని చెప్పారు, 

    గుర్తుందా? లోకము మనలను ద్వేషిస్తే ఆశ్చర్యపడవద్దని, మనకంటే ముందు ప్రభువునే లోకము 

    ద్వేషించిందని ముందే హెచ్చరించారా, లేదా? మన శత్రువు సాతాను దేవుని పిల్లలందరినీ ఎలా 

    నిందిస్తున్నాడో తెలుసుకోవాలంటే ప్రకటన గ్రంధం 12:10 చదవాలి. మరియు ఒక గొప్ప స్వరము పరలోక 

    మందు ఈలాగు చెప్పుట వింటిని. రాత్రింబగళ్లు మన దేవునియెదుట మన సహోదరులమీద నేరము 

    మోపువాడైన అపవాది పడద్రోయబడి యున్నాడు”  హల్లెలూయ! సాతానునే ప్రభువు పడద్రోసినపుడు 

    నిందించే ఇతరులను ఆయన లెక్క చేస్తాడా? మనలను నీతిమంతులుగా తీర్చినవాడు సర్వాధికారము గల 

    ప్రభువే! ఇక చింత ఎందుకు? మన మనస్సాక్షి మనలను ఏదైనా పాపము, దోషము అపరాధము విషయము 

    దోషారోపణ చేస్తున్నట్లయితే దాని విషయం ప్రభువు వద్ద సరిచేసుకోవాలి. యేసయ్య రక్తము చేత 

    శుద్ధిచేసుకొని పాపముపైన విజయమును ఆయన కృప చేత పొందాలి. ఒక్క సారి క్షమించబడిన తరువాత 

    ఇక ప్రభువు గతమును జ్ఞాపకము చేసుకోడు. క్షమించే విషయములో దేవుడు చేసిన వాగ్దానములు గొప్పవి. 

    యేషయ. 43:25, యిర్మీయ 31:34, హెబ్రీ 8:12 చదవండి. ఇంకా అనుమానం వేధిస్తునట్లయితే, కంఠస్థం 

    చేయండి.

         మూడవ ప్రశ్న 34వ వచనములో ఉన్నట్టు,శిక్ష విధించువాడెవడు?” క్రీస్తు మన న్యాయవాది అనే

    గొప్ప సత్యాన్ని గమనించండి. “చనిపోయిన క్రీస్తుయేసే; అంతే కాదు, మృతులలోనుండి లేచినవాడును 

    దేవుని   కుడి పార్శ్వమున ఉన్నవాడును మనకొరకు విజ్ఞాపనము కూడ చేయువాడును ఆయనే” యేసు 

    ప్రభు పరిచర్య లోని మూడు భాగాలు ఇక్కడ స్పష్టంగా ఉన్నవి: 1.ఆయన మరణించాడు. 2. సమాధిలో 

    నుండి తిరిగి లేచాడు. 3.తండ్రి కుడిప్రక్కలో కూర్చొని, నిరంతరం, ఎడతెరపి లేకుండా మనకోసం విజ్ఞాపన 

    చేస్తూ ఉన్నాడు. హల్లెలూయ! ఎంత గొప్ప రక్షకుడు మన యెసయ్య!! ఆయన క్షమించిన తరువాత 

    ఎవ్వరూ శిక్ష విధించలేరు. మన తీర్పును, శిక్షను ఆయన భరించాడు. నీవు, నేను యేసు క్రీస్తు ప్రభువును 

    మన స్వంత, వ్యక్తిగత రక్షకుడుగా, అనగా పాపమునుండి విడిపించే రక్షకునిగా హృదయములో, 

    జీవితములో చేర్చుకున్నపుడు, ఎవ్వరు శిక్ష వేయలేరు. ప్రభువు సిలువ మీద “సమాప్తం” అని 

    అరిచినపుడు నీ శిక్ష అంతా తాను భరించానని అర్ధం, నీ ఋణం అంతా, ఏమి మిగల్చకుండ, తీర్చానని 

    అర్ధం. నిజానికి అది అప్పు చెల్లించినప్పుడు దస్తావేజులమీద వ్రాసే మాట. గ్రీకులో “టేటేలేస్టై” అంటారు. ప్రియ 

    శ్రోతలరా? మీరు దీన్ని మీ జీవితానికి అన్వయించుకునేంతవరకు, నీవు పాపివని ఒప్పుకొని, 

    మారుమనస్సు పొందేవరకు ఇది నీకు వర్తించదు. ఇప్పుడే ప్రభువునకు నీ హృదయం తెరవవచ్చు. వెంటనే 

    క్షమాపణ, విమోచన మీకు దొరుకుతుంది.    

         ఇక నాలుగవ ప్రశ్న “ఎడబాపువాడెవడు?” మన జీవితపు పరిస్థితులు మనలను క్రీస్తు నుండి వేరు 

    చేయగలవా? పౌలు గారు వాటిని ఉచ్చరించి, ఏవీ ఎన్నడూ ఎడబాపలేవని ఖచ్చితంగా బోధిస్తున్నాడు. 

    35వ వచనం చదువుదామా? నాతో బాటు చదవండి. “క్రీస్తు ప్రేమనుండి మనలను ఎడబాపు వాడెవడు?  

    శ్రమయైనను బాధయైనను హింసయైనను కరవైనను వస్త్రహీనతయైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను 

    మనలను ఎడబాపునా?” ఇంకా 38వ వచనము వరకు పెద్ద లిస్ట్ ఉన్నది. మీరు అనుభవించే పరిస్థితులు 

    వీటికంటే పెద్దవా?సృష్టింపబడిన మరి ఏదైనను, మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమనుండి 

    మనలను ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నాను.”  ప్రియ సోదరీ సోదరులారా! యేసే మన పక్షంగా 

    ఎల్లప్పుడు ఉండేవాడు, విరోధులతో వ్యాజ్యమాడేవాడు ఆయనే! క్రీస్తే నీతిమంతులుగా తీర్చినవాడు! ఆయనే 

    మరణించి, తిరిగి లేచి తండ్రి కుడిప్రక్కలో కూర్చొని విజ్ఞాపన చేస్తూ ఉన్న న్యాయాధిపతి, ఆయనే నిన్ను 

    నన్ను తన ప్రేమతో ఆవరించి భద్రపరిచి, నిత్యరాజ్యములో చేర్చేవాడు! 

     

    అసలు ప్రశ్న ఏమిటంటే, నీవు ఆయనలో ఉన్నావా? లోకములో ఉన్నావా?  

    ఈ ప్రశ్నకు మీ జవాబు పైన మీరు ఇంతవరకు చదివిన సత్యాలు మీకు వర్తిస్తాయా లేదా 

    తెలుసుకోవచ్చు. 

    మీకు ప్రార్ధన అవసరమైతేమాకువ్రాయవచ్చు (వివరాలు పైన ఇవ్వబడినవి), ఫోన్  చేయవచ్చు. 

    ఫోన్ నంబర్ 98663 41841



II కొరింధీ -15 2~12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము

>   II Cor-15   2 ~~ 12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము          శ్రోతలూ , బాగున్నారా ? ప్రస్తుత ప్రపంచ...