రోమా పత్రిక అధ్యయనం - 27 8:5-13 దేవుణ్ణి సతోషపెట్టడం ఎలాగు?

  • చాలా మంది వృద్ధులు పెద్ద అక్షరములే చదువగలిగినందు చేత పెద్ద అక్షరములు వాడుతున్నాము. 

  • దేవుని వాక్య పారాయణం చేసి దైవాశీస్సులు  పొందండి.  మీరు ఏ విధమైన దీవెనలు పొందారో కామెంట్స్ లో   వ్రాయండి,  మీ ప్రార్ధన మనవులు తెలియ చేయండి. మీకోసం ప్రార్ధిస్తాం.  sajeevanireekshana@gmail.com ఇ-మెయిల్  లేదా వాట్సప్ 9866 341 841 ద్వారా నైనా తెలియచేయండి. 
  • Please let us know your prayer requests. We will pray for you. Please send an e-mail to sajeevanireekshana@gmail.com. 
  • Or send a message by WhatsApp to 98663 41841

 

రోమా పత్రిక అధ్యయనం - 27  8:5-13

దేవుణ్ణి సతోషపెట్టడం ఎలాగు?

       Praise the Lord! మీకందరికీ ప్రభువు నామంలో శుభములు! ఎంత త్వరగా జనవరి నెల చివరికి వచ్చేశాం కదూ! మీలో ఎందరు క్రొత్త సంవత్సరంలో బైబిల్ చదవడం ఆరంభించారో వారందరినీ అభినందిస్తున్నాను. దేవుని పరిశుద్ధ లేఖనములలో శక్తి, బలము, జీవము, జ్ఞానము, నిరీక్షణ ఉన్నవి. ఇంతవరకు మీ జీవితంలో బైబిల్ గ్రంధం ఒక్కసారి అయిన, సంపూర్తిగా చదవని వారు ఈ రోజైన మొదలు పెట్టండి, క్రమబద్ధంగా ప్రతి దినం 3 అధ్యాయాలు, ప్రభువు దినం 5 అధ్యాయాలు చదివితే, మరుసటి సంవత్సరం ఈ దినానికి మీరు బైబిల్ ముగిస్తారు. గట్టి నిర్ణయo తీసుకొని ఆరంభించండి. అట్టి కృప ప్రభువు మీకనుగ్రహించుగాక! 

       ఇతరులను తృప్తి పరచడం మనకందరికీ బాగా తెలుసు. తల్లితండ్రులు పిల్లలను, ఒకరిని మరొకరు తృప్తి పరుస్తూ ఉంటారు. ఉద్యోగులు యజమానులను, ఒకరిని మరొకరు తృప్తి పరుస్తూ ఉంటారు. దేవునితో సంబంధం గలవారు ఆయనను తృప్తి పరచాలి. అదెలాగో తెలుసుకోవడానికి ఈనాటి బైబిల్ అధ్యయనం చాలా సహాయ పడుతుంది. 

లేఖన భాగం చదువుకుందాం. రోమా 8:5-13. 

5. శరీరానుసారులు శరీరవిషయములమీద మనస్సు నుంతురు; ఆత్మానుసారులు ఆత్మవిషయములమీద మనస్సునుంతురు; శరీరాను సారమైన మనస్సు మరణము; 6. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై యున్నది. 7. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైయున్నది; అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. 8. కాగా శరీరస్వభావము గలవారు దేవుని సంతోషపరచ నేరరు. 9. దేవుని ఆత్మ మీలో నివసించియున్నయెడల మీరు ఆత్మస్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయనవాడు కాడు. 10. క్రీస్తు మీలోనున్నయెడల మీ శరీరము పాపవిషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతివిషయమై జీవము కలిగియున్నది. 11. మృతులలో నుండి యేసును లేపినవాని ఆత్మ మీలో నివసించినయెడల, మృతులలోనుండి క్రీస్తుయేసును లేపినవాడు చావునకులోనైన మీ శరీరములను కూడ మీలో నివసించుచున్న తన ఆత్మద్వారా జీవింపజేయును. 12. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు ఋణస్థులము కాము. 13. మీరు శరీరానుసారముగా ప్రవర్తించినయెడల చావవలసినవారై యుందురు గాని ఆత్మచేత శారీర క్రియలను చంపినయెడల జీవించెదరు.  

 

దేవుణ్ణి ఎలా తృప్తి పరచగలమో ఆపో. పౌలు నేర్పించే సత్యాలు నేర్చుకుందాం. 

మొదటిది, శరీరస్వభావము, దాని పని ఏమిటో పరీక్షించాలి. “శరీరానుసారమైన మనసు” అంటే ఏమిటి? మనoదరిలో ఉండే సహజసిద్ధమైన పాపపు స్వభావము. ఇది 24గంటలు మనతోనే, మనలోనే ఉంటుంది. దాన్నిబట్టి మనము పాపములో జీవించాలనే కోరికతో ఉంటాము. కానీ, ప్రియ శ్రోతలూ, దాని ఫలితం మరణము, లేదా నిత్యనరకం అని గ్రహించండి. 7వ వచనములో గమనించండి, అది దేవునికి వ్యతిరేకమైనది, విరోధమైనది. అంటే ఏమిటి? దేవునితో యుద్ధం చేస్తుంది. దేవునికి లోబడి, విధేయత చూపడం ఇష్టముండదు. 8వ వచనములో చూడండి, వారు దేవుని సంతోషపెట్టలేరు. శరీర స్వభావము లేదా శరీరానుసరమైన మనసు దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు. ఎందుకు? మనలోని పాపపు స్వభావము మనలను మనము హెచ్చ్చించుకుంటుంది. జాగ్రత్తగా వింటున్నారా, శ్రోతలూ? శరీరానుసారమైన మనసు అంటే, ప్రాచీన పాపపు స్వభావము దేవుని సంతోషపెట్టలేదు. పరిశుద్ధ గ్రంధం బైబిల్ దీన్ని స్పష్టంగా తెలియచేస్తుంది. మన పాపపు స్వభావమునకు మరొక పేరు శరీరానుసారమైన మనస్సు. అది దేవునికి విరుద్ధ్ధమైనది. దేవుని సంతోశపెట్టడానికి నేర్చుకొనవలసిన మొదటి బోధన ఇది. 

దేవుని సంతోషపెట్టడానికి నేర్చుకోవలసిన రెండవ బోధన, లేక ఆదేశము, అంతరంగంలో నివసించే పరిశ్ధ్ద్ధాత్ముని అధిపత్యమును అనుభవించాలి. ఆధిపత్యం మారుతున్నది. పాపపు శారీరనుసారమైన మనసునకు ఆధిపత్యం, అధికారము లేదు. 9వ వచనము నేర్పుతున్నట్టుగా, “దేవుని ఆత్మ మీలో నివసించియున్నయెడల మీరు ఆత్మస్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయనవాడు కాడు.” క్రీస్తు ప్రభువు ఆత్మ లేనివానికి ఆయనకు ఎటువంటి సంబంధం ఉండదు. ఆ వ్యక్తి ఆయనకు చెందినవాడు కాడు. అక్కడితో అయిపోలేదు. అతడిలో లేదా ఆమెలో క్రీస్తు ఆత్మ నివసిస్తున్నపుడు, ఇక వారు పాపపు ప్రాచీన స్వభావపు అధికారమునకు కాదు గాని, ఆత్మకు, అనగా పరిశుధ్ద్ధాత్ముని అధిపత్యానికి, అధికారానికి లోబడి జీవిస్తారు. గమనిస్తున్నారా, శ్రోతలూ? ఆధిపత్యం మారినందుచేత ఇప్పుడు వారు లేదా మీకు అన్వయించుకుంటే మీరు, బోధన, ఆదేశాలు, పాపపు ప్రాచీన స్వభావము నుండి కాదు గాని, దేవుని ఆత్మ నుండి పొందుతారు. అంతరంగంలో నివసిస్తున్న పరిశ్ద్ధాత్ముడు ఆదేశాలు, బోధన ఇచ్చి ఎలా జీవించాలో, ఏమి చేయాలో, దేవుని పరిశుధ్ద లేఖనాలద్వారా బోధిస్తాడు. ఇది అసలైన పరీక్ష. 10వ వచనంలోని “యెడల” అనే మాట మనము “చేత” అనే అర్ధమిస్తుందని గ్రహించాలి. అనగా “ “దేవుని ఆత్మ మీలో నివసించియున్నయెడల” అనే దాన్ని”, “దేవుని ఆత్మ మీలో నివసించి యున్నందుచేత” అని చదువుకోవాలి, గ్రహించాలి. “క్రీస్తు మీలోనున్నందుచేత మీ శరీరము పాపవిషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతివిషయమై జీవము కలిగియున్నది.” హల్లెలూయా! ఎంత అద్భుతమైన సంగతి! నమ్ముతున్నారా? ఇందులో ఎలాంటి అనుమానము లేదు. క్రీస్తు మీలో, నాలో ఉన్నందుచేత, ఆ కారణాన్నిబట్టి “శరీరము” అనగా పాపపు ప్రాచీన స్వభావము చనిపోయింది. ఏ విధంగా అని ఆలోచిస్తున్నారా? జాగ్రతగా వినండి. యేసు క్రీస్తు రక్షకుడు సిలువమ్రాను మీద మరణించినందుచేత, ఆయన మన పాపపు ప్రాచీన స్వభావమునకు మరణాన్ని తెచ్చారు. ఆయన మరణమే మన స్వభావాల్లో ఉండే పాపపు నైజమును చంపివేస్తుంది. అప్పుడే, మన ఆత్మ నీతి విషయం జీవమును కలిగిఉంటుంది. దేవుణ్ణి సంతోషపెట్టడానికి పరిశుద్ధాత్ముడు మనలో జీవిస్తాడు. మన అంతరంగములో నివసించే పరిశుధ్ద్ధాత్ముడు దేవుణ్ణి సంతోష పెడతాడు. ఇప్పుడు ఏ విధంగా మనము దేవుణ్ణి సంతోష పెట్టగలమో బోధపడిందా? ఆధిపత్యం మారుతుంది. మీరు, నేను పరిశుధ్ద్ధాత్ముడు ఆధిపత్యం వహించడాన్ని అనుభవిస్తాము. దేవుణ్ణి సంతోష పెట్టె మార్గమిది. 

ఇక మూడవ బోధన, లేదా ఆదేశము. చావునకు లోనైన శరీరమును, అనగా పాపస్వభావమును జయించడానికి అభ్యాసం చేయాలి. 11వ వచనం ఎంత ఆశను, ధైర్యాన్ని పుట్టిస్తుంది కదూ! నాతోబాటు బిగ్గరగా ఈ వాగ్దానమును చదవండి: “మృతులలో నుండి యేసును లేపినవాని ఆత్మ మీలో నివసించినయెడల, మృతులలోనుండి క్రీస్తుయేసును లేపినవాడు చావునకులోనైన మీ శరీరములను కూడ మీలో నివసించుచున్న తన ఆత్మద్వారా జీవింపజేయును.” హల్లెలూయ! మన దేవుడు ఎంతటి శక్తిమంతుడో, ఎంతగా నిన్ను నన్ను విజయము కోసము ఈ అధ్యయనాల ద్వారా సిద్ధపరుస్తున్నాడో తెలుసుకుంటున్నారా? ఈ అధ్యయనాలను చులకనగా తీసుకోకండి, దేవునికి మీ పట్ల అద్భుతమైన ఉద్దేశ్యమున్నది. అది మిమ్మల్ని విజయవంతులుగా నిలువబెట్టి ఆయన రాజ్యములో వారసులుగా చేయడం. ఆత్మ జీవితం మనలోనికి క్రొత్త జీవన శైలిని సూది మందు ఎక్కించినట్టు ఎక్కిస్తుంది. దాని ద్వారా క్రొత్త అవగాహన, క్రొత్త దిశ, క్రొత్త మార్గము కలిగుస్తుంది. 12 వ వచనం ఏమని బోధిస్తుంది? “కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు ఋణస్థులము కాము.” కానే కాము. ఏమి చేయాలి? 13 వ వచనంలో ఉన్నట్టు “ఆత్మచేత శారీర క్రియలను చంపినయెడల జీవించెదరు.” పరిశుధాత్మ కృప, శక్తి చేత శారీర క్రియలు అనగా పాపపు స్వభావమును “చంపివేయాలి” ఇదే విజయపు రహస్యం! అట్టి రీతిగా చేయుటకు త్రియేక దేవుడు మనకందరికీ సహాయము చేయుగాక! ఆమెన్!


______________________________________________________________________________



రోమా పత్రిక అధ్యయనం - 26 8:1-4 దేవుని ధర్మశాస్త్రమును తృప్తి పరచండం ఎలాగు?

 

  • చాలా మంది వృద్ధులు పెద్ద అక్షరములే చదువగలిగినందు చేత పెద్ద అక్షరములు వాడుతున్నాము. 

  • దేవుని వాక్య పారాయణం చేసి దైవాశీస్సులు  పొందండి.  మీరు ఏ విధమైన దీవెనలు పొందారో కామెంట్స్ లో   వ్రాయండి,  మీ ప్రార్ధన మనవులు తెలియ చేయండి. మీకోసం ప్రార్ధిస్తాం.  sajeevanireekshana@gmail.com ఇ-మెయిల్  లేదా వాట్సప్ 9866 341 841 ద్వారా నైనా తెలియచేయండి. 

  • Please let us know your prayer requests. We will pray for you. Please send an e-mail to sajeevanireekshana@gmail.com. 
  • Or send a message by WhatsApp to 98663 41841

 

                                              రోమా పత్రిక అధ్యయనం  - 26   8:1-4

జీవితం విచిత్రమైంది అనిపిస్తుంది కదూ! ఊహించని సంఘటనలు, తెలుసుకోలేని విషయాలు, అర్ధoకాని మనుషులు, బాధపెట్టే సమస్యలు, ఇంకా ఎన్నెన్నో... ఒక విషయం మాత్రం సత్యం. యేసు క్రీస్తు ప్రభువునకు సమస్తం తెలుసు, కాదు కాదు, ఆయన సమస్తమును ముందే నిర్ణయించి, జరిగించేవాడు. సర్వాధికారి, సర్వకృపానిధి, సర్వశక్తిమంతుడు. ఆయనకు తెలియకుండా నీకు జరుగుతున్నదీదీ లేదు. ఈ విషయం మత్తయి సువార్త 28:18 లో, ఇతర లేఖన భాగాల్లో కూడా స్పష్టంగా ఉన్నది. అందుచేత చింతచేయడం మాని, విశ్వాసమును ఆశ్రయించండి. దేవుని వాక్యము విశ్వాసమును పుట్టిస్తుంది. రoడి, మీ బైబిల్, నోట్ బుక్, పెన్ తెచ్చుకొని, రేడియొకు దగ్గరగా ప్రశాంతగా కూర్చొని, దేవుని వాక్యమును వినండి.

ఈనాటి మన అంశం: దేవుని ధర్మశాస్త్రమును తృప్తి పరచండం ఎలాగు?  లేఖన భాగం ఆపో. పౌలు రోమీయులకు వ్రాసిన పత్రిక 8:1-4 బైబిల్ తెరిచారా? రోమా 8:1-4

            1 కాబట్టి యిప్పుడు క్రీస్తుయేసునందున్నవారికి ఏ శిక్షావిధియు లేదు.

            2 క్రీస్తుయేసునందు జీవమునిచ్చు ఆత్మయొక్క నియమము పాపమరణముల నియమమునుండి         నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలక పోయెనో దానిని దేవుడు చేసెను.

            3 శరీరము ననుసరింపక ఆత్మననుసరించియే నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన        నీతివిధి నెరవేర్చబడవలెనని పాప పరిహారమునిమిత్తము

            4 దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి, ఆయన శరీరమందు పాపమునకు  శిక్ష విధించెను.

ఈ కొద్ది వచనాల్లో ఆపో. పౌలు దేవుని ధర్మశాస్త్రమును ఈ విధంగా నెరవేర్చగలమో బోధిస్తున్నాడు. కొన్ని చర్యలు మనము తీసుకున్నట్లయితే అది చేయగలము. అవేమిటో సావధానంగా తెలుసుకుందాం.

మొదటిది: మనము ఆత్మయందు జీవించాలని నిర్ణయించుకోవాలి. అనగా పరిశుద్ధాత్మ యందు జీవించాలని నిర్ణయించుకోవాలి. మనమంతా పాపులము అని చెప్పడములో ఏ సందేహము లేదు. మన స్వభావము, హృదయము, మనసు, అంతా పాప భూయిష్టమే, ఇది మన అందరి అనుభవమే. దేవుని వాక్కుకూడా దీన్ని రోమా 3:23లో నిర్ధారిస్తుంది. “ఏ భేదమును లేదు, అందరును పాపము చేసి దేవుడనుగ్రహించు మహిమను పొందలేకపోవుచున్నారు”  ధర్మశాస్త్రము మన పాపమును బట్టి శిక్ష విధిస్తుంది.

     ఆత్మయందు జీవించడం మనము ఎందుకు నిర్ణయించుకోవాలంటే, ఆయన, అనగా పరిశుద్ధాత్ముడు మనలను స్వతంత్రులుగా చేస్తాడు. శ్రోతలూ, జాగ్రతగా గమనించండి, పౌలు భక్తుడు ఆత్మ అని వ్రాస్తున్నపుడు, అది బోల్డ్ గా అనగా పెద్ద అక్షరాలతో వ్రాసినపుడు అది పరిశుద్ధాత్మునికి గుర్తు.  ఈ నాడు పరిశుద్ధాత్ముణ్ణి గూర్చి అందరూ ఎవరికి తోచినట్టు వారు చెబుతున్నారు. లేఖనాలు ఏమి చెబుతున్నాయో అదే సత్యం. “ క్రీస్తు యేసునందు జీవమునిచ్చుఆత్మ” అనే మాటలు గమనించారా? యేసుప్రభువుతో వ్యక్తిగత సంబంధం కలిగినవారు మాత్రమే ఆయనయందు జీవిస్తారు. అలాంటి వారికి పరిశుద్ధాత్ముడు జీవమునిస్తాడు, స్వాతంత్రము నిస్తాడు. ఆత్మననుసరించి జీవించడం అంటే ఏమిటి? 

పరిశుధ్దాత్మ ననుసరించి జీవించే వారిలో కొన్ని రుజువులు కనిపిస్తూఉంటాయి. 

 1. వారు పాపమునకు దూరముగా జీవించాలని అన్నీ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.  తెలియపరచబడిన దేవుని ప్రత్యక్షతకు వ్యతిరేకంగా జీవించడం పాపము. అది పరిశుద్ధ గ్రంధం బైబిల్లో గుప్తమైఉంది. యేసు క్రీస్తును నీవు నీ హృదయంలో కలిగిఉన్నపుడు, ఆయన నీ పాపమoతటినీ తీసుకొంటాడు, తన జీవం నీకిస్తాడు. అది ఒక మార్పిడిజరిగే అనుభవము. అంచేత ఇప్పుడే సిలువ చెంతకు వెళ్ళి నీ పాపమoతటినీ ఒప్పుకో, ఆయన నీకు దానికి బదులుగా పరిశుద్ధాత్మ ద్వారా  తనజీవమిస్తాడు. 

 2. అపోహలను వారు విడిచిపెట్టి నిజమైన ఆత్మ శక్తితో జీవిస్తారు. దేవుని అత్యంత పరిశుద్ధ ప్రమాణాలకు మనము చేసే ఏవి కూడా సరితూగవు. ఏ నీతి కార్యాల ద్వారా, ఏ స్వంత ప్రయత్నముచేత నీవు, నేను పరిశుద్ధాత్మ శక్తిని పొందలేవు. ఆయనను తృప్తిపరచలేవు. మనచుట్టూ అపోహలను సత్యమన్నట్టు బోధిస్తూ, చూపిస్తూ, మభ్యపెట్టే వారు ఉన్నారు. మోసపోకండి, దేవుని వాక్యమును తెలుసుకొనండి. 

3. ఆత్మలో జీవించడమంటే, దేవుని వాక్యములో, వాక్యప్రకారము జీవించడమే!  వాక్యమే “శరీరధారి”గా యేసుక్రీస్తుగా జీవిస్తున్నాడు. ఆయన తన నోటి ఊపిరి చేత అనుగ్రహించిన వాక్యములో నీవు సంపూర్ణంగా నింపబడినపుడు ఆయన జీవము, ఊపిరి నీలో నిండుతుంది. 

4. పరిశుధ్ద్ధాత్ముడు యేసు క్రీస్తు ప్రభువు గురించి మాట్లాడుతాడు, ఆయనను ఘనపరుస్తాడు. ఆత్మలో జీవించేవారు  యేసు క్రీస్తు ప్రభువు వెలుగువైపే వెళ్లాలని మిక్కుటమైన, బలమైన కోరికతో జీవిస్తారు. ఆయన వెలుగు కృప ప్రేమలతో నిండివుంటుంది. 

5. ఆత్మలో జీవించేవారు ప్రార్థన ద్వారా, క్రీస్తువారిపైన పూర్తిగా ఆధారపడతారు. ప్రభువుదగ్గర విచారణ చేయకుండా ఒక్క అడుగు వేయరు, ఒక్క తీర్మానం తీసుకోరు. అడుగడుగునా ఆయనపైనా ఆధారపడి జీవిస్తారు. 

ఈ రుజువులు మనలో కనిపిస్తున్నాయా? పరీక్షించుకుందాం.

రెండవది, క్రీస్తు మార్గములో మనము ఆనందముతో పండుగలాగా సంతోషించాలి.  శ్రోతలూ, గమనించండి. సహజసిద్ధంగా మనము పాపపు బానిసత్వములో ఉన్నాము. దాని ఫలితం మరణము. శరీర నియమము మన పాపపు స్వభావములో ఉన్నది. ఆపో.శరీరము ననుసరింపక ఆత్మననుసరించియే నడుచుకొను మనయందు..అని 3వ వచనములో అంటున్నపుడు అర్ధం ఏమిటి? శరీర స్వభావము ప్రకారము కాదుగానీ, పరిశ్ద్ధాత్ముడు నడిపించే మార్గములో మనము నడవాలి. గ్రీక్ భాషలో నడచుట అనే మాటకు, జీవించుట అనే మాటకు ఒకటే మాట వాడారు. ఇది క్రొత్త మార్గము. యేసు క్రీస్తు ప్రభువునకు చెందిన ఈ మార్గములో జీవముంటుంది. శరీర స్వభావపు మార్గములో మరణం ఎంత ఖచ్చితమూ, క్రీస్తు యొక్క క్రొత్త మార్గములో జీవము అంతే ఖచ్చితం. పాపమునకు ఫలితముగా మరణము ఎలాగు తప్పనిసరిగా ఉంటుందో, అలాగే యేసుక్రీస్తునందు ఆత్మద్వారా జీవించినపుడు జీవము తప్పనిసరిగా కలుగుతుంది. 

     2వ వచనములో ఉన్న మహా బలమైన సత్యమును మనము గ్రహించాలి. “క్రీస్తుయేసునందు జీవమునిచ్చు ఆత్మయొక్క నియమము పాపమరణముల నియమమునుండి నన్ను విడిపించెను.”  ఈ సత్యమును మహా సంతోషముతో ఆస్వాదించండి. క్రీస్తు మార్గము విశ్వాసులను ఉన్నత స్థానములో ఉంచుతుంది. పాపపు మరణపు నియమము, లేదా చట్టమునుండి మనలను యేసుక్రీస్తు నందు నిలువబెట్టడానికి మనకు గొప్ప విడుదల కలిగింది. ఇది మీరు గ్రహించారా? అనుభవిస్తున్నారా?

      మూడవది, దేవుని క్రియను మనము హక్కులాగా స్వంతం చేసుకోవాలి. మనము అసాధ్యం అనుకునేవి దేవునికి సాధ్యం. ధర్మశాస్త్రం మననుండి ఆశించేవి కటినమైనవి, వాటిని మనము చేయలేదు, కానీ ప్రభువు తన అద్భుతశక్తి చేత మనము చేయలేనివి చేయడానికి కృప కలిగిస్తాడు. ధర్మశాస్త్రము నిర్దేశించింది మన పాపపు స్వభావమును బట్టి చేయలేకపోయాము. అప్పుడు దేవుడు తన కుమారుడు యేసు క్రీస్తు ప్రభువును మనలాంటి శరీరముతో పంపించి, మన పాపమునకు రావలసిన శిక్షను ఆయనమీద మోపాడు. గమనించండి, శ్రోతలూ, యేసు క్రీస్తు ప్రభువు ధరించింది మనలాంటి శరీరమే కానీ, పాపములేని శరీరము. మనంతట మనము ధర్మశాస్త్రపు విధిని నెరవేర్చలేము. అందుచేత, తండ్రియైన దేవుడు తన కుమారుడు యేసు క్రీస్తు ప్రభువు మరణ, పునరుద్ధ్ధానముల ద్వారా మన పక్షంగా నెరవేర్చాడు. నీవు నేను, యేసు క్రీస్తునందు విశ్వాసము ద్వారా, ఆయనలో జీవించినపుడు, మనము ధర్మశాస్త్రము నెరవేర్చిన వారమవుతాము. ఇదొక్కటే, ధర్మశాస్త్రమును నెరవేర్చి తృప్తి పరిచే మార్గము. ఆయన మరణించింది, మనము జీవించడానికి, ఆయన కోసం జీవించడానికి. నీవు సిధ్ధమా? ఆయనకోసం జీవించాడానికి, పరిశుద్ధాత్ముడు మనకందరికీ సహాయము చేయుగాక! 

 

II కొరింధీ -15 2~12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము

>   II Cor-15   2 ~~ 12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము          శ్రోతలూ , బాగున్నారా ? ప్రస్తుత ప్రపంచ...