- చాలా మంది వృద్ధులు పెద్ద అక్షరములే చదువగలిగినందు చేత పెద్ద అక్షరములు వాడుతున్నాము.
- దేవుని వాక్య పారాయణం చేసి దైవాశీస్సులు పొందండి. మీరు ఏ విధమైన దీవెనలు పొందారో కామెంట్స్ లో వ్రాయండి, మీ ప్రార్ధన మనవులు తెలియ చేయండి. మీకోసం ప్రార్ధిస్తాం. sajeevanireekshana@gmail.com ఇ-మెయిల్ లేదా వాట్సప్ 9866 341 841 ద్వారా నైనా తెలియచేయండి.
- Please let us know your prayer requests. We will pray for you. Please send an e-mail to sajeevanireekshana@gmail.com.
- Or send a message by WhatsApp to 98663 41841
క్రొత్త సంవత్సరం నిజంగా క్రొత్తదా? డిసెంబర్ 27,2020
-----Pastor Vijay Bhaskar S.
నాతో బాటు దేవునికి స్తోత్రం చెప్పండి! మీ
సమస్త్య ఏదైనా, మీ వేదన ఎంతటిదైనా,
దేవునికి మించింది కాదుకదా! ఆయనను మనసారా, దీనంగా, పశ్చాత్తాపంతో ఆశ్రయిస్తే,
కరుణించే దేవుడు యేసు క్రీస్తు.
మీ కందరికీ క్రొత్త సంవత్సర శుభములు! Wish you all a blessed, fruitful New Year!! కొద్ది రోజుల్లో
2020 అని తేదీలో రాయలేము గాని 2021 అని రాయవలసి ఉంటుంది. సంవత్సరం మారిపోతుంది.
సంవత్సరం క్రొత్తదని మనము సంతోషపడవచ్చు. కానీ ఒక సంగతి మార్చి పోతున్నామేమో
అనిపిస్తున్నది. నిజంగా కేవలం క్రొత్త సంవత్సరంలో ప్రవేశించామని సంబరపడడం, టపాకాయలు
కాల్చడంవల్ల ఏమైనా మేలు కలుగుతుందా? దయచేసి నాతోబాటు ఆలోచించండి. మరో చేదునిజం
ఉన్నదున్నట్టు మొమాటం లేకుండా మీతో చెప్పాలంటే, మనము మరికొంత మన జీవితంలో సమాధికి
దగ్గరయ్యామనే విషయం మీతో చెప్పడానికి కొంత వెనుకాడుతున్నాను, కానీ సత్యం చెప్పక తప్పదు.
ప్రియ స్నేహితుడా, సోదరీ, యవతీ యువకులారా? దయచేసి కొంచెం ఆలోచించండి. దేవునియందు
విశ్వాసము ఉంచినవారైనా, దేవుని విస్మరించినవారైనా, అందరి విషయంలో ఇది సత్యమే!
మరి ఈ క్రొత్త సంవత్సరము నిరాశ మిగిల్చిందా? ముమ్మాటికీ, ఎంత మాత్రం కాదు. క్రొత్త
సంవత్సరంలో క్రొత్తదనం పొందవచ్చు. అంతా మారిపోయే సదుపాయం, అవకాశం ఉంది. దయచేసి
సావధానంగా వినండి. ఏదైనా పనిచేస్తూ వింటునట్లయితే, కొంచెం సేపు అది ఆపేసి శ్రద్ధతో, మీ
మససుల్లో మీ సృష్టికర్త అయిన దేవునికి ప్రార్ధిస్తూ వినండి.
బైబిల్లో క్రొత్తదనానికి క్రొత్త జీవితానికి రాచబాట ఉంది. కులమని, మతమని, పేద, ధనిక వ్యత్యాసం
లేకుండా, పండిత పామరుడని పక్షపాతం లేకుండా, నేపధ్యo ఏదైనా, ఆస్తి, అంతస్తులనే భావన ఏ
మాత్రం లేకుండా, మానవాళితో అందరితో దేవుడు ఒక క్రొత్త నిబంధన చేశాడు. అందుకే బైబిల్ లోని
రెండవ భాగమును క్రొత్త నిబంధన అని పిలుస్తారు. ఎందుకు? ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చేసిన
నిబంధను వారు కాలరాసి తమను స్వంత బిడ్డలుగా స్వీకరించి, జ్యేష్ట పుత్రునిగా ప్రేమించి,
అసాధారణమైన అద్భుతములు చేసి వారిని బానిసత్వము నుండి విమోచించి, గద్ద తన రెక్కల మీద
పిల్లలను
మోసినట్టు వారిని మోసికొని వెళ్ళాడు. భీకరుడు, మహోన్నతుడు నీవు
నేను ఊహించలేనంత
పరిశుద్ధుడు అయినప్పటికీ, ముష్కరులైనవారి మధ్యలో నివాసమున్నాడు. వారు ఆయనకు ప్రతి
దినం ప్రతి విషయములో కోపము పుట్టించారు. అయినా ఎంతో ఓపికతో సహనముతో కేవలము క్రమ
శిక్షణలో పెట్టడానికే తప్ప క్రూరంగా వాళ్ళను శిక్షించలేదు. హోరేబు కొండ మీద తన నిబంధన ఆజ్ఞలు
వారికి ఇచ్చినపుడు, అతి దారుణoగా విగ్రహారాధనచేసి ఆయనకు అమితమైన కోపం పుట్టించారు. ఆ
సమయంలో దేవుడు అందరినీ నశింపచేసి మోషేను గొప్ప జనముగా చేస్తానని మోషేతో చెప్పాడు.
ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని ఓపికను పరీక్షించి ఆయన నిబంధనను ప్రేమను, కృపను
తిరస్కరించి తిరుగుబాటు చేశారు. ఈ విషయాలు ద్వితీయోపదేశ కాండములో మోషే స్పష్టంగా
వివరించాడు. భీకరుడైన దేవుడు, సర్వ సృష్టికర్త, వారి మీద సర్వాధికారము కలిగినప్పటికీ వారిని
నశింపచేయలేదు. తన పరిశుద్ధతను దాని ప్రమాణమును ఇసుమంతకూడ పలుచన చేయలేదు,
ఆయన పరిశ్దుద్ధత ఎన్నటికీ మారదు. నిజానికి దేవుడు ఇశ్రాయేలీయుల ద్వారా భూమి మీద ఉన్న
జనములు జాతులన్నిటికీ తన ప్రేమ, రక్షణ, కృపలను చూపించాలని ఉద్దేశించాడు. ఈ విషయo
కీర్తనలలో స్పష్టమవుతుంది. దావీదు మాటలలో చాలాసార్లు స్పష్టమవుతుంది. I దిన. 16: 30-34
వచనాలు చదవండి.
అయినప్పటికీ, తన వాగ్దానము ఆది. 3:15 లో ఇచ్చినదాని నెరవేర్పుగా దేవుడు క్రొత్త నిబంధన
చేశాడు. అది కేవలo ఇశ్రాయేలీయులతో మాత్రము కాదు సర్వమానవాళితో చేశాడు. యేసు క్రీస్తు
అందరికీ ప్రభువు. ఆయన రక్తము ద్వారా పాపమునుండి విమోచన కలుగుతుంది. II కోరింథీ 5:17
మీ బైబిల్లో గమనించండి. “కాగా ఎవడైనను క్రీస్తు నందున్నయెడల వాడు నూతన సృష్టి; పాతవి
గతించెను, ఇదిగో క్రొత్త వాయెను; సమస్తమును దేవుని వలననైనవి; ఆయన మనలను క్రీస్తుద్వారా
తనతో సమాధానపరచుకొని, ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా,
దేవుడు వారి అపరాధములను వారిమీద మోపక, క్రీస్తునందు లోకమును తనతో
సమాధానపరచుకొనుచు, ఆ సమాధానవాక్యమును మాకు అప్పగించెను.”
సంవత్సరాలు ఎన్ని మారినా, జీవితం మారకపోతే అంతా వ్యర్ధమే. ఒక్కరోజు సంబరపడినంత మాత్రాన
జీవితం మారదుకదా? హృదయం, మనస్సు మారితే జీవితం మార్పు చెందుతుంది. యేసు క్రీస్తును
హృదయ పూర్వకంగా నమ్మిన వారు, ఆయనను వారి పాపమునుండి విమోచించమని అడిగిన ప్రతి
ఒక్కరినీ ఆయన మార్పు చెందిoచాడు, మార్పు చెందిస్తూ ఉన్నాడు. 2020 సంవత్సరమే కాదు, నీ
జీవితమంతా నీవు చేసిన ప్రతి పాపము, అపరాధము, దోషములన్నింటిని బట్టి దేవునితో నీ సంబంధం
తెగిపోయింది. అందుకే ఎన్ని క్రొత్త సంవత్సరాలు దొర్లిపోయినా మార్పు లేదు. కానీ నీ హృదయం
క్రొత్తదైతే నీ జీవితం క్రొత్తదవుతుంది. మన హృదయము ఎలాంటిదో తెలుసుకున్నారా? యిర్కీయా 17:
9. “హృదయము ఆనిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధికలది. దాని గ్రహింపగలవాడెవడు?”
మన హృదయాల పరిస్థితి ఇది. కానీ ఈ హృదయము క్రొత్తదైతే జీవితం మారుతుంది. ఇది ఎలా
సాధ్యం?
“యేసు క్రీస్తునందు” ఉంటే, క్రొత్త సృష్టిగా మారుతుంది. దీన్ని మారు మనస్సు అంటుంది బైబిల్. తిరిగి
జన్మించడం అంటుంది. ప్రియ సోదరీ, స్నేహితుడా, నీకు క్రొత్త సంవత్సరం కావాలా? క్రొత్త జీవితం
కావాలా? యేసు క్రీస్తు ప్రభువు తనవద్దకు విశ్వాసముతో, దీనమనస్సుతో, ఉన్నది ఉన్నట్టు, వచ్చి
క్రొత్త హృదయము అనుగ్రహించమని, అడిగిన ప్రతి ఒక్కరినీ క్రొత్త హృదయముతో ఆశీర్వదించాడు. అది
ఆయన రక్తము ద్వారా సాధ్యం. ఆయన సిలువ మరణం, పునరుధ్ధానము ద్వారా సాధ్యం.
క్రొత్త హృదయమే కాదు, క్రొత్త స్వభావము నీకు కలిగే అవకాశముంది. మన స్వభావముతో
మనము పుట్టాము. అది జన్మతో వచ్చింది. యేసుప్రభువు మన స్వభావమును మార్చగల
శక్తిమంతుడు. యెహే. 36:25నుండి చందువుకుందాం. మీ బైబిల్లో గమనించండి, నాతో బాటు
చందవండి, “మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధజలము చల్లుదును, మీ
విగ్రహములవలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసెదను. నూతన హృదయము మీ
కిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసెదను, రాతిగుండె మీలోనుండి తీసివేసి మాంసపు
గుండెను మీకిచ్చెదను. నా ఆత్మను మీయందుంచి, నా కట్టడల ననుసరించువారినిగాను నా విధులను
గైకొనువారినిగాను మిమ్మును చేసెదను.” హల్లెలూయ! దేవునికి మహిమా ఘనత, స్తోత్రం
కలుగుగాక!! దేవుని వద్దకు వచ్చినవారంతా మార్పు చెందారు. మోషే, యెహోషువ, ఏలియా, ఎలిష,
ప్రవక్తలు, అపోస్తలులు, ఆదిమ విశ్వాసులు, అందరూ మార్పు చెందారు, క్రొత్త స్వభావము వారికి
ఇవ్వబడింది. పరిశుధ్ద్ధాత్ముని శక్తిని బట్టి, ఆయన కృపనుబట్టి దేవుని వాక్యమునకు లోబడి, విధేయత
చూపినంత మేరకు క్రమ క్రమంగా మార్పు చెందారు. విధేయతకు మనము సిద్ధంగా ఉంటే, తన శక్తిని
దేవుడు అనుగ్రహించడంలో వెనుకాడడు. నీకు క్రొత్త సంవత్సరం కావాలా? క్రొత్త స్వభావం కావాలా?
యేసు క్రీస్తు పాపుల రక్షకుడు. నీవు పాపివని ఒప్పుకొనే దీనమనసు యధార్ధ హృదయముతో
నీవు ఉన్నావా? నీవు మనసారా, నిజమైన పశ్చాత్తాపముతో నీ పాపమoతటినీ యేసు క్రీస్తు
రక్షకునియెదుట, ఒప్పుకొని, నీకు క్రొత్త హృదయం, క్రొత్త స్వభాము కావాలని అడిగినట్లయితే ఆయన
మాట తప్పడు. కోట్లాది మందిని కనికరించినట్లే, నన్ను కనికరించినట్టే, నిన్ను కూడా కనికరించడానికి
సిద్ధంగా ఉన్నాడు. నీవు సిధ్ధమా?