- దేవుని వాక్య పారాయణం చేసి దైవాశీస్సులు పొందండి. మీరు ఏ విధమైన దీవెనలు పొందారో కామెంట్స్ లో వ్రాయండి, మీ ప్రార్ధన మనవులు తెలియ చేయండి. మీకోసం ప్రార్ధిస్తాం. sajeevanireekshana@gmail.com ఇ-మెయిల్ లేదా వాట్సప్ 8143178111 ద్వారా నైనా తెలియచేయండి.
- Please let us know your prayer requests. We will pray for you. Please send an e-mail to sajeevanireekshana@gmail.com.
- Or send a message by Whats App to 81431 78111
తెలుసుకొనుట చేయమని అజ్ఞాపిస్తుంది
దేవునికి స్తోత్రం! మీరంతా బాగున్నారా? కొందరు దుష్టునితో
పోరాడుతూ ఉండవచ్చు. ఈ అంత్య దినాల్లో చాలామంది విశ్వాసం బలహీనపడుతుంది. కొందరు, శోధనలు, మరికొందరు, పరీక్షలు, అనగా
విశ్వాసమునకు కలిగే పరీక్షలు, కుటుంబంలో శాంతి నెమ్మది లేక క్రుంగి ఉండవచ్చు. దేవుని
వాక్యం నెమ్మది, నిరీక్షణ, ధైర్యం ఇస్తుంది, రండి, దేవుని మాటలు విని నెమ్మది,
ధైర్యం పొందుదాo!
దేవుడు ఆదామును సృష్టించినపుడు ఆదాము ఏదైనా
క్రియ చేసినట్లయితే దాని గూర్చిన హక్కు,
భాధ్యత రెండిటినీ ఇచ్చాడు. ఇంకా చూస్తే, ఆదాము తాను ఏది చేయాలో ఎంచుకోగలడు, ఎలా
చేయాలో ఎంచుకోగలడు. ఆదాము సంతానముగా మనము కూడా ఆయనలాగే ఉన్నాము, మనము కూడా అలా
ఎంచుకోగలము. మనము యాంత్రికంగా ప్రవర్తించము. మన క్రియలు మనకు కలిగిన తెలివి,
జ్ఞానము నుండి కలుగుతాయి.
అయినా కొందరు
వారు చేసే దానికన్న తెలిసినవారు ఉన్నారు. నిజానికి మనమందరం అలాంటివారమే. మనము
చేసేదానికన్నా ఎక్కువ మనకు తెలుసు. దీని అర్ధo వ్యక్తిగత జీవితంలో ఏమిటో మనము జాగ్రత్తగా పరీక్షించి తెలుసుకోవాలి. మనము
చేసేదానికన్నా ఎక్కువ తెలుసుకొనిఉండడం చాలా తీవ్రమైన సంగతి.
రోమా. 2:17-29 లో తెలుసుకోవడం చేయమని అజ్ఞాపిస్తుంది
అనే విషయముతో పౌలు మనలను ముఖాముఖీ చేస్తున్నాడు.
17. నీవు యూదుడవని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవునియందు అతిశయించుచున్నావు కావా?
18. ఆయన చిత్తమెరిగి, ధర్మశాస్త్రమందు ఉపదేశము పొందిన వాడవై శ్రేష్ఠమైనవాటిని
మెచ్చుకొనుచున్నావు కావా?
19. జ్ఞానసత్యస్వరూపమైన
ధర్మశాస్త్రము గలవాడవైయుండినేను గ్రుడ్డివారికి త్రోవచూపువాడను,
20. చీకటిలో ఉండువారికి
వెలుగును, బుద్ధిహీనులకు
శిక్షకుడను, బాలు రకు ఉపాధ్యాయుడనై
యున్నానని నీయంతట నీవే ధైర్యము వహించుకొనుచున్నావు కావా?
21. ఎదుటివానికి బోధించు
నీవు నీకు నీవే బోధించుకొనవా? దొంగిలవద్దని
ప్రకటించు నీవు దొంగిలెదవా?
22. వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించెదవా? విగ్రహములను అసహ్యించుకొను నీవు గుళ్లను దోచెదవా?
23. ధర్మశాస్త్రమందు
అతిశయించు నీవు ధర్మశాస్త్రము మీరుటవలన దేవుని అవమానపర చెదవా?
24. వ్రాయబడిన ప్రకారము
మిమ్మునుబట్టియేగదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడు చున్నది?
25. నీవు ధర్మశాస్త్రమును అనుసరించి
ప్రవర్తించు వాడవైతివా, సున్నతి
ప్రయోజనకరమగును గాని ధర్మశాస్త్రమును అతిక్రమించువాడవైతివా, నీ సున్నతి సున్నతి కాకపోవును.
26. కాబట్టి సున్నతి లేనివాడు ధర్మ శాస్త్రపు నీతి విధులను గైకొనిన
యెడల అతడు సున్నతి లేనివాడై యుండియు సున్నతిగలవాడుగా ఎంచబడును గదా?
27. మరియు స్వభావమునుబట్టి
సున్నతి లేనివాడు ధర్మశాస్త్రమును నెరవేర్చినయెడల అక్షరమును సున్న తియు గలవాడవై
ధర్మశాస్త్రమును అతిక్రమించు నీకు తీర్పు తీర్చడా?
28. బాహ్యమునకు
యూదుడైనవాడు యూదుడు కాడు; శరీరమందు బాహ్యమైన
సున్నతి సున్నతికాదు.
29. అయితే అంతరంగమందు
యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధ మైనదై ఆత్మయందు జరుగునదే గాని
అక్షరమువలన కలుగునది కాదు. అట్టివానికి మెప్పు మనుష్యులవలన కలుగదు, దేవునివలననే
కలుగును.
ఈ లేఖన భాగములో అపొస్తలుడు తెలుసుకోవడం చేయడాన్ని అజ్ఞాపిస్తుంది అని చెప్పడానికి గల
కారణాలను నిర్దేశించాడు.
తెలుసుకోవడం చేయడాన్ని అజ్ఞాపిస్తుంది అని చెప్పడానికి మొదటి కారణం తెలుసుకొనిఉండడం అనేది మహత్తరoగా కోరదగినది. దేవుని చిత్తం తెలుసుకోవడం చాలా ఉన్నతమైనది. ఈ లేఖన భాగం యూదులు ధర్మశాస్త్రమును పొందారని సెలవిస్తుంది. “నీవు యూదుడవని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవునియందు అతిశయించుచున్నావు కావా?” మనకు బైబిల్ గ్రంధం ఉన్నది. ఆనాడు, ఈనాడు దాని గురించి తెలుసుకొని ఉండడం ఉన్నతమైన సంగతి.
దేవుని చిత్తం
తెలుసుకోవడంలో ఒక సంతృప్తి కలిగించే ధైర్యం ఉంది. ప్రపంచములో వందలాది, అవును,
వేలాది, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే లక్షలాది మంది దేవుని చిత్తం తెలియని
వారున్నారు. కానీ ఇశ్రాయేలీయులకు దేవుడు ధర్మశాస్త్రమును ఇచ్చాడు గనుక వారు దేవుని చిత్తమును తెలుసుకొనిన ప్రజలయ్యారు. మనము దేవుని చితమును పరిశుధ్ధగ్రంధం బైబిల్
ద్వారా తెలుసుకోవచ్చు.
దేవుని
చిత్తమును తెలుసుకోవటములో ఒక ఆనందం కలిగించే ఆదరణ ఉన్నది. ఎందుకనగా మనము ఇతరులకు
సహాయపడచ్చు. దానిని చూడలేని గుడ్డితనముతో చీకటిలో నడుస్తున్న వారికి మనము
సహాయపడచ్చు. దేవుని చిత్తమును గూర్చిన తెలివి, జ్ఞానము మనము కలిగిఉన్నందుచేత,
వారికి సహాయపడి, వారు తొట్రుపాటు పడిపోకుండా సహాయపడవచ్చు.
దేవుని
చిత్తమును తెలుసుకోవటంలో ఒక
స్వాగతపూర్వకమైన ఫలితం ఉంటుంది. తెలియని వారికి తెలియచెప్పవచ్చు. అనుభవం
లేని వారికి చెప్పవచ్చు. వారికి సత్యమును అందిచవచ్చు.
కాబట్టి దేవుని చిత్తమును తెలుసుకోవడం మహత్తరoగా కోరదగినది, కాబట్టి మనము దాన్ని చేయవచ్చు.
కానీ, కేవలం తెలుసుకొన్నంత మాత్రాన ఏ
ప్రయోజనము ఉండదు. తెలుసుకోవడం చేయడంగా మారితే తప్ప అది స్వార్ధమే అవుతుంది. తెలుసుకోవడం
క్రియలకు, లేదా ప్రవర్తనకు దారితీయాలి.
తెలుసుకోవడం చేయడాన్ని శాసిస్తుంది అని చెప్పడానికి మరొక
కారణం తెలిసిందాన్ని అనుసరించి జీవించడం ఒక ఖచ్చితమైన
భాధ్యత. అపొస్తలుడు తెలుసుకోవడం దగ్గరినుండి వెంటనే అనుసరించి జీవిoచడం విషయం మాట్లాడుతున్నాడు. ఆయన తెలుసుకొన్నవారి గురించి తెలుసుకొంటున్నవారి గురించి చాలా
ప్రశ్నలు అడుగుతున్నాడు. నీవు బోధిస్తున్న దాన్ని ప్రకారం నీవు జీవించడం ఒక
అవసరమైన సత్యం. అనగా నీవు ఒకరికి బోధిస్తున్నపుడు నీకు నీవే బోధించుకుంటున్నావన్నమాట. దొంగతనము చేయవద్దు అని
ఒకరికి నీవు బోధిస్తున్నపుడు నీవు కూడా దొంగతనం చేయకూడదు. ఒక వ్యక్తికి వ్యభిచారం
చేయవద్దు అని నీవు బోధిస్తున్నట్లయితే నీవు కూడా వ్యభిచారం చేయకూడదు. విగ్రహములను
ఆరాధిచడం తప్పు అని నీవు బోధిస్తున్నట్లయితే నీవు కూడా విగ్రహములను పూజింపకూడదు.
నీకు తెలిసిందానిని నీవు అనుసరించి చేయడం ఒక ఖచ్చితమైన భాధ్యత. నీకు తెలిసిందానికి
నీవు విధేయత చూపడం అత్యవసరం.
దాని ఫలితము గూర్చి ఆలోచించండి. “ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రము మీరుటవలన దేవుని అవమానపర చెదవా?” మాటల తరువాత క్రియలు వస్తాయి. దేవుని నేను ఎరుగుదునని చెప్పేవారు వారి ప్రవర్తనచేత వారి దేవుని గూర్చి సాక్ష్యమిస్తారు. అప్పుడు దేవుడు ఎవరో తెలుస్తుంది. 24వ వచనములో ఉన్నట్టు, “వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియేగదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడు చున్నది?” దేవుని తెలుసుకొని విశ్వసించామని చెబుతూ వారికి తెలిసిందానికి వ్యతిరేకంగా జీవిస్తున్నందుచేత దేవుని నామమునకు దూషణ కలుగుచున్నది.
అందుచేత దేవుని గురించి తెలిసినవారు, వారి జీవితాలను
వారి చేతనైనంత మట్టుకు ఆయన వాక్కు ప్రకారం జీవించాలి. నీకు తెలిసిందాని ప్రకారం
జీవించు.
తెలుసుకోవడం చేయడాన్ని
శాసిస్తుంది అని చెప్పడానికి చివరి కారణం రూపాంతరం
చెందడానికి అది అద్భుతమైన అవకాశం. తెలుసుకోవడం,
అనుసరించడం, రూపాంతరము చెందడం అను వాటికి
ఉన్న వరుసక్రమమును గమనించండి. ధర్మశాస్త్రము వలన కలిగే నీతి ఒక అంతరంగపు అనుభూతి అని
అపొస్తలుడు చెబుతున్నాడు. ధర్మశాస్త్రము నిర్దేశించిన సరయిన ప్రవర్తన దాని సత్ఫలితాలను ఇస్తుంది. దేవుని చట్టం మనము
ఎలా జీవించాలో బోధించింది, మనము దేవుని చట్టం ప్రకారం జీవించినట్లయితే, అప్పుడు ఆ
విధేయత ఆనందం, అంతరంగములో నీతి అనే మంచి
ఫలితాలనిస్తుంది.
అపో. పౌలు ఒక గుంపుతో మరొక గుంపును పోల్చి చూపించి ఈ నీతిని వివరిస్తున్నాడు. ఒక గుంపును సున్నతి గుంపు, మరొకటి సున్నతిలేనీ గుంపు అని పిలుస్తున్నాడు. యూదులు సున్నతి గుంపు, యూదులు కానివారు అన్యులు అనే గుంపు. ఇప్పుడు, ఆయన చెబుతున్న దేమీటనగా, అన్యులు, అనగా సున్నతి లేనివారు ధర్మశాస్త్రమును నెరవేర్చినపుడు సున్నతి గుంపువారు ధర్మశాస్త్రమును మీరితే వీరి నీతి సున్నతిగుంపు వారి నీతికంటే ఉన్నతమైనది.
ఇది విషయం. ఇక్కడ ఒక ధర్మశాస్త్రముతెలియని వ్యక్తి ఉన్నాడు. కాని అతడు స్వభావసిధ్ధంగా దేవుడు ధర్మశాస్త్రములో నిర్దేశించింది నేరవేర్చాడు. ధర్మశాస్త్రము కలిగిఉన్నాకూడా దానికి విధేయత
చూపించని వారి కంటే దేవునికి విధేయత
చూపేవారు ఉన్నతస్థాయిలో ఉంటారు. కాబట్టి ఒక వ్యక్తి ధర్మశాస్త్రమునకు విధేయత చూపడము తప్ప దానినీతి
యందు నమ్మకముంచలేడు.
కాని
అపొస్తలుడు ఇంకా ముందుకు వెళ్ళి, రూపాంతరం చెందడం జీవితవిధానంలో కనిపిస్తుంది అని తేటపరుస్తున్నాడు. ఆయన చెప్పేది ఏమిటనగా, ఒక
యూదుడు పైపైకి యూదుడుగా కనబడినంత మాత్రాన యూదుడు కాడు. అతడు ధర్మశాస్త్రములోని అన్ని ఆచారములు, వంశ పారంపర్యంగా వచ్చే పధ్ధతులు పాటిస్తే సరిపోదు.
అంతమాత్రాన అతడు యూదుడు కాడు. ఒకవ్యక్తి అంతరంగములో, బాహ్యముగా యూదుడైతే లేదా
విశ్వాసములో నిలబడినవాడైతే సరే. సున్నతి హృదయమునకు, ఆత్మలో జరిగి ఉండాలి.
కాబట్టి బాహ్యమైనది అంతరంగముతో అంతరంగము లోనిది బాహ్యముతో పొందికగలిగి ఉండాలి. అవి రెండు సామరస్యంగా ఉండాలి, దాని ద్వారా దేవునికి స్తుతి కలగాలి, మనుషులకు కాదు. మనము యేసు నందు అద్భుతంగా రూపాంతరము చెందాలంటే, తెలుసుకోవడం చేయడమును అజ్ఞాపిస్తుంది అనే సూత్రమునకు స్పందించాలి.
తెలుసుకొన్నదాన్ని చేసేంతవరకు ఈ మూడు కారణాలను బట్టి శాయశక్తుల ప్రయత్నం చేయాలి. తెలుసుకొనిఉండడం అనేది ఎంతో కోరదగినది. తెలిసిందాన్ని అనుసరించి జీవించడం ఒక ఖచ్చితమైన భాధ్యత. రూపాంతరం చెందడానికి అది అద్భుతమైన అవకాశం. మన జీవితాలపట్ల దేవునికి ఉన్న ఉద్దేశమునకు అనుకూలంగా నీవు జీవించినట్లయితే, అప్పుడు అంతరంగములో రూపాంతరం చెందడం సాధ్యమవుతుంది. మనము ఏది తెలుసుకుంటామో అది మనము ఏమి అవుతామో, ఏది చేస్తామో నిర్దేశిస్తుంది.
ప్రియ స్నేహితుడా, సోదరీ, దేవుని వాక్యపు వెలుగులో నీ పరిస్థితి ఏమిటి? నీ మాట, క్రియ ఒక్కటిగా ఉన్నాయా? ఎంత తెలుసు అనేదానికంటే తెలిసినదానిలో ఎంత క్రియల్లో చేస్తున్నాము అనేది ముఖ్యమైనది. రూపాంతరం చెందేవరకు విశ్రమించకుండా ప్రార్ధించి, శోధనలు జయించి, మన రక్షకుడు యేసయ్య అత్యున్నత, అతిపరిశుధ్ధ నామానికి కీర్తి తెచ్చేవరకు ప్రభువు మనకు శక్తి, కృపనిచ్చుగాక!
ప్రార్ధన: మహా కృపగలిగిన పరమ తండ్రీ, మా జీవితాలు మీ వాక్యపు వెలుగులో యధార్ధముగా పరీక్షించుకోవడానికి సహాయము చేయండి. మా
జీవితములను బట్టి మీ నామమునకు దూషణ కలుగుతున్నదని
ఒప్పుకుంటున్నాము. క్షమాపణ కోరుకుంటున్నాము. మీ పరిశుద్ధ వాక్యమునకు మా
జీవితములను సరిచేసుకొనే కృప అనుగ్రహించుమని క్రీస్తు నామములో బ్రతిమాలుతున్నాము,
పరమతండ్రీ, ఆమెన్!!